IPL 2026: కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. గుజరాత్‌పై కేకేఆర్ ఘన విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్రేక్ వేసింది. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. టాప్-2 బెర్త్ ఖరారు చేసుకోవాలనుకున్న గుజరాత్ ఆశలకు గండిపడింది.
ఫిన్ అలెన్ విధ్వంసంతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. చెత్త ఫీల్డింగ్‌తో నాలుగు క్యాచ్‌లు వదిలేసి గుజరాత్ టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది.
కేకేఆర్ ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 93) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘు వంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82 నాటౌట్), కామెరూన్ గ్రీన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కు ఇది ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులే చేసి ఓటమిపాలైంది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85), జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), సాయి సుదర్శన్(28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/29) రెండు వికెట్లు తీయగా.. సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే..
ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆటగాళ్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా డేంజరస్ ప్లేయర్ ఫిన్ అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఆరంభంలోనే అందుకోలేకపోయారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జాసన్ హోల్డర్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో వదిలేసాడు.
33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను మహమ్మద్ సిరాజ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 10 సిక్సర్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కామెరూన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్‌లో అర్షద్ ఖాన్ వదిలేయగా.. ఈ అవకాశంతో గ్రీన్ 23 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే అంగ్‌క్రిష్ రఘువంశీ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేసాడు. దాంతో అతను మరింత దూకుడుగా ఆడి 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రెండు క్యాచ్‌లు అందుకున్నా.. కేకేఆర్ స్కోర్ 220లోపు పరిమితమయ్యేది.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
కామెరూన్ గ్రీన్, రఘువంశీ మూడో వికెట్‌కు అజేయంగా నెలకొల్పిన 109 పరుగుల భాగస్వామ్యం గేమ్ ఛేజింగ్ మూమెంటమ్‌గా నిలిచింది. ఫిన్ అలెన్ విధ్వంసానికి ఈ ఇద్దరి భాగస్వామ్యం తోడవ్వడంతో కేకేఆర్ ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇద్దర్ని గుజరాత్ కట్టడి చేసినా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.












Click it and Unblock the Notifications