టీమిండియాలో గుర్తింపునకు నోచుకోని స్టార్ ఆల్ రౌండర్- ఫైనల్ లో ఎక్స్ ఫ్యాక్టర్
టీమిండియా మరో చారిత్రక ఘట్టానికి తెర తీయబోతోంది. టీ20 వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచివుంది. ఈ సాయంత్రం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. భారత్ గెలిస్తే- మూడోసారి టైటిల్ సాధించినట్టవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే, ఈ ట్రోఫీని గెలుచుకున్న ఏడో జట్టు అవుతుంది.
ఈ రెండూ కూడా ఐసీసీ టోర్నమెంట్ల మూడు ఫార్మాట్లు.. టెస్టులు, వన్డేలు, టీ20 ఫైనల్స్‌లో తలపడిన తొలి జట్లుగా చరిత్ర సృష్టించారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ఆకట్టుకుంది. గ్రూప్ దశలో అన్ని నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైనా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గతంలో 2007, 2024లలో ట్రోఫీని గెలిచిన భారత్.. ఈసారి గెలిస్తే మూడు ప్రపంచకప్‌లు సాధించిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. సొంతగడ్డపై టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలుస్తుంది.

ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత జట్టుకు అనుకూలంగా పలు ఆసక్తికరమైన అంశాలు తోడయ్యాయి. భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశాలలో ప్రధానమైంది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యాక్టర్. ఫైనల్ మ్యాచ్‌లలో గంభీర్‌కు అసాధారణ రికార్డు ఉంది. అతను ప్లేయర్ గా ఉన్న ఏ ఒక్క ఫైనల్ మ్యాచ్ ను కూడా టీమిండియా ఓడిపోలేదు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో ఓపెనర్ గా కీలక పాత్ర పోషించాడు.
అంతేకాదు- ఐపీఎల్‌లో 2012, 2014లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కెప్టెన్‌గా రెండుసార్లు విజేతగా నిలిపాడు. రిటైర్‌మెంట్ తర్వాత కేకేఆర్ మెంటర్‌గా కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలిపించాడు. కెరీర్‌లో ఏ ఫైనల్‌లోనూ ఓడిపోని గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్ గా ఉండటం భారత జట్టుకు బలమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది.
రెండో అంశం శివమ్ దూబే- టీమిండియాలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఉండటం. దూబే జట్టులో ఉండగా.. భారత్ ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఓటమిని చవిచూడలేదు. ఇటువంటి ప్రపంచ ఈవెంట్‌లలో అద్భుత ప్రదర్శనలు చేస్తోన్న ప్రతీసారి జట్టులో శివమ్ దూబే ఉన్నాడు. అందుకే జట్టుకు ఛార్మ్ గా భావిస్తున్నారు.
కొన్నేళ్లుగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ భారత్‌కు నిరాశను మిగిల్చింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో సహా భారత్ ఓడిన అనేక కీలక మ్యాచ్‌లకు అతను అంపైరింగ్ చేశాడు. ఈ ఫైనల్‌కు కెటిల్‌బరో లేడు. అంపైరింగ్ ఫలితాలను ప్రభావితం చేయనప్పటికీ గత వైఫల్యాలతో ముడిపడిన వ్యక్తి లేకపోవడాన్ని సానుకూలంగా భావిస్తోన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications