రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై గంభీర్ సంచలన ప్రకటన

అనుకున్నదే జరిగింది. కీలకమైన ఐదో టెస్ట్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయన్ని మూటగట్టుకుంది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఈ ఓటమితో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ సిరీస్‌లో ఒకరిద్దరు మినహా మిగిలిన ఆటగాళ్లు తేలిపోతున్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ కూడా ఉన్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్ట్ నుంచి తప్పుకోగా, సిడ్నీ టెస్ట్‌లో కోహ్లీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఫాంలో లేనని చెప్పి, కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇదే టెస్ట్‌లో కోహ్లీ ఘోరంగా విఫలం అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసిన కోహ్లీ, కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరి జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శన చాలా నిరాశపరిచింది. వీరిద్దరూ తమ స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు.

Gautam Gambhir Big Statement On Rohit amp amp Virat

దీంతో భారత జట్టు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అలాగే, బోర్డర్ గవాస్కర్ ట్రోపీని చేజార్చుకుంది. తమ ప్రదర్శనతో ఈ సీనియర్ ఆటగాళ్లు జట్టుకు భారంగా మారుతున్నారు. తాజాగా వీరిద్దరి భవిష్యత్తుపై కోచ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. గంభీర్ మాట్లాడుతూ.. ఐదు నెలల తర్వాత టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడనుందని గంభీర్ తెలిపారు.ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఆ పర్యటనలో చాలా విషయాలు మారవచ్చని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఈలోపు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడటం చాలా తొందరగా పడడమే అవుతుందని కోచ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. ఐదు నెలల తర్వాత జట్టులో చాలా మార్పులు , చేర్పులు ఉండవచ్చంటూ గంభీర్ హింట్ ఇచ్చారు. ఐదు నెలల తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ టూర్ ముందు ఈ విషయాలను చూద్దామంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. దీంతో రోహిత్, కోహ్లీ కెరీర్లకు ముగింపు పలికినట్టే అని అంతా అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+