అగార్కర్ కు సెండాఫ్ ఇచ్చిన గంభీర్-ఈ చరిత్ర నిన్ను గుర్తుంచుకుంటుంది మిత్రమా

బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకునున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 4వ తేదీతో అగార్కర్ కాంట్రాక్ట్ ముగిసింది. మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ.. అతని కాంట్రాక్ట్ గడువును పొడిగించడానికి బీసీసీఐ సుముఖంగా లేదు. చీఫ్ సెలెక్టర్ హోదాను భర్తీ చేయడానికి బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. తదుపరి చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓఝా అపాయింట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అజిత్ అగార్కర్‌ను ప్రశంసిస్తూ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ఇది. దీనికి అగార్కర్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను జత చేశారు. అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గంభీర్ పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా సాగాలని తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Gautam Gambhir Hails Chief Selector Ajit Agarkar and says History Will Be Kinder to You farewell

డియర్ అజిత్ భాయ్..

డియర్ అజిత్ భాయ్.. అంటూ అగార్కర్ ను సంబోధించారు. ''మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన అద్భుతమైన గౌరవం. క్రికెట్‌లో సాధించిన ఆ మూడు ఐసీసీ ట్రోఫీలు మీ తిరుగులేని పట్టుదల, అంకితభావానికి నిదర్శనం.. మీ ఆలోచనల్లో ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు విజయాలకే మొదటి ప్రాధాన్యత ఉంది.. చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ఇప్పటివరకు మీరు అందించిన అద్భుతమైన సహకారానికి ధన్యవాదాలు.." అని పేర్కొన్నారు.

అజిత్ హయాంలో అనూహ్య నిర్ణయాలు..

గంభీర్ హెడ్ కోచ్‌గా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి వ్యూహాత్మకంగా పనిచేశారు. జట్టులో కీలక మార్పులు చేయడం, యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడంలో వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర సమన్వయం జట్టు పురోగతికి దోహదపడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పలు అనూహ్య నిర్ణయాలను తీసుకుంటూ వచ్చింది. సీనియర్లతో పాటు నవతరం ఆటగాళ్లను ప్రోత్సహించేలా అగార్కర్ ప్రణాళికలు రూపొందించారు. వాటిని పక్కాగా అమలు చేయగలిగారు.

గంభీర్ ఇచ్చిన ఈ సెండాఫ్ ఊహాగానాలకు తెరలేపింది. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిందా లేదా క్రికెట్ బోర్డులో ఆయన ఏవైనా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారా అనే విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝాను నియమించాలని బీసీసీఐ ఇదివరకే నిర్ణయించింది. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక చీఫ్ సెలెక్టర్గా వ్యవహరిస్తోన్నాడీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+