దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి: భవిష్యత్తుపై గంభీర్ కీలక నిర్ణయం

భారత టెస్ట్ క్రికెట్ జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి అనంతరం.. తన భవిష్యత్తు గురించి అడిగినప్పుడు గౌతమ్ గంభీర్ ఆ నిర్ణయాన్ని పూర్తిగా బీసీసీఐకి వదిలేశారు. గత 25 ఏళ్లలో స్వదేశంలో తొలిసారిగా సిరీస్ వైట్‌వాష్ ఎదుర్కొన్న తర్వాత గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత టెస్ట్ జట్టు కోచ్‌గా తన భవిష్యత్తు గురించి మీడియా అడిగిన కఠినమైన ప్రశ్నకు గంభీర్ సూటిగా సమాధానమిచ్చారు. తాను కోచ్‌గా కొనసాగాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అని స్పష్టం చేశారు. గంభీర్ మాట్లాడుతూ.. "ఇది బీసీసీఐ నిర్ణయించుకోవాల్సిన విషయం. నేను గతంలో కూడా చెప్పాను, భారత క్రికెటే ముఖ్యమైనది, నేను కాదు. ఇంగ్లాండ్‌లో ఫలితాలు సాధించిన, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిన వ్యక్తిని నేనే. ఈ జట్టు నేర్చుకునే దశలో ఉంది."గౌహతిలో దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల భారీ ఓటమి అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Gautam Gambhir on India 0-2 Test Series Loss to South Africa Future in BCCI Hands

సిరీస్ ఓటమి గురించి అడిగినప్పుడు.. గంభీర్ భారత జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. అయితే ఆ నింద తన నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు. "నింద అందరిపైనా ఉంది, అది నా నుంచే మొదలవుతుంది" అని గంభీర్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే భారత జట్టు ఏమి చేయాలని అడిగినప్పుడు.. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని హెడ్ కోచ్ సూచించారు."మీరు నిజంగా టెస్ట్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటే, టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించండి. భారత్‌లో టెస్ట్ క్రికెట్ గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే, సమష్టి కృషి అవసరం. మీరు ఆటగాళ్లను లేదా ఒక వ్యక్తిని మాత్రమే నిందించలేరు" అని గంభీర్ అన్నారు.

టెస్ట్ క్రికెట్‌లో భారత్ కు మరో ఘోర పరాభావం ఎదురైంది. సొంతగడ్డపై మరో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్‌ అయ్యింది. దక్షిణాఫ్రికాతో గౌహతి వేదికగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్‌ను ఓడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+