IND vs NZ: కివీస్ చేతిలో అందుకే చిత్తుగా ఓడాం-మూడో టెస్టు వేళ గంభీర్ సంచలనం..!
న్యూజీలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కోల్పోయింది. శుక్రవారం ప్రారంభమవుతున్న మూడో టెస్టులోనూ ఓటమి పాలైతే రోహిత్ సేనకు వైట్ వాష్ ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా భారత్ పదిలంగా దాచుకుంటున్న టెస్టు విజయాల రికార్డును ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, కివీస్ చేతిలో ఎందుకు టెస్టు సిరీస్ ఓడిపోయామన్న అంశాలపై టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ నోరు విప్పాడు.
భారత్-న్యూజీలాండ్ మధ్య ముంబై వాంఖడే మైదానంలో మూడో టెస్టు ప్రారంభం కాబోతున్న వేళ నగరానికి చేరుకున్న టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్.. కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ లో రెండు టెస్టులు ఎందుకు ఓడిపోయిందన్న అంశంపై గంభీర్ కారణం చెప్పాడు. మితిమీరిన టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు కివీస్ సిరీస్ లో పేలవంగా ఆడారని గంభీర్ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ కు పెరిగిన ఆదరణతో క్రికెటర్లు కూడా డిఫెన్స్ ఆడటంలో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించాడు.

వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటానికి ఉన్న ప్రాధాన్యాన్ని బ్యాటర్లు మర్చిపోకూడదని, తద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయని గౌతీ వెల్లడించాడు. ముఖ్యంగా టెస్టుల్లో క్లిష్ట పరిస్ధితులు ఎదురైనప్పుడు బ్యాట్స్ మెన్ దూకుడు తగ్గించి ఆడాల్సి ఉంటుందని గంభీర్ సూచించాడు. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో విఫలమైన బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను మూడో టెస్టుల్లో ఆడించకూడదని టీమ్ మేనేజ్ మెంట్ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications