రక్తపుమడుగులో పారా అథ్లెట్ మృతదేహం- సీసీటీవీ ఫుటేజీలో..

ఉత్తరప్రదేశ్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. నేషనల్ పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో పడివున్న ఆయన మృతదేహం ఘజియాబాద్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి ఉపవన్ ప్రాంతంలో శనివారం రాత్రి లభ్యమైంది. స్థానికంగా భయాందోళనలకు దారి తీసింది. ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కు ఎంపికైన రెండో రోజే త్యాగి హత్యకు గురి కావడం క్రీడారంగంలో సంచలనం సృష్టించింది.

పారా ఆసియా గేమ్స్ ట్రయల్స్ కోసం చిరాగ్ త్యాగి శుక్రవారం వరకూ ఢిల్లీ స్పోర్ట్స్ హాస్టల్ లో ఉన్నారు. అక్కడ నిర్వహించిన రౌండ్స్ లల్లో విజయం సాధించాడు. ఆసియా గేమ్స్ కు ఎంపికయ్యాడు. అనంతరం శనివారం ఉదయం తన స్వస్థలం మురాద్‌నగర్‌లోని బసంత్‌పూర్ సత్లీ స్వగ్రామానికి బయలుదేరాడు. ఆ తరువాత ఆయన ఫోన్ స్విచాఫ్ అయింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి ఉపవన్‌ వద్ద ఆయన మృతదేహం లభించింది.

Ghaziabad Para Athlete Chirag Tyagi Found Dead Suspicious Person Detained After CCTV Clue by Police

సమాచారం అందిన వెంటనే కొత్వాలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సచిన్ కుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిరాగ్ త్యాగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీపుపై గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది బుల్లెట్ వల్ల కలిగిందా లేక ఇతర వస్తువుతో సంభవించిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని తెలిపారు. మరణానికి ఖచ్చితమైన కారణం పోస్ట్‌మార్టమ్ నివేదికతోనే తెలుస్తుంది. అతన్ని షూట్ చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అనుమానితుడు యష్ ఖటిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. యష్ కూడా పారా అథ్లెట్‌. గతంలో చిరాగ్‌తో కలిసి ట్రైనింగ్ సెషన్స్ కు హాజరు అయ్యేవాడు. పారా అథ్లెట్ల ధృవీకరణ అంశంపై చిరాగ్, యష్ మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తోన్నాయి. యష్ పై చిరాగ్ ఫిర్యాదులు కూడా చేశాడని చెబుతున్నారు. దీంతో అతని అర్హత రద్దయింది. దీనిపై ఆగ్రహించిన యష్ ప్రతీకారంతో పిస్టల్‌తో చిరాగ్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

రెండు రోజుల కిందటే చిరాగ్.. పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించాడు. అంతకుముందు బెంగళూరులో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో స్వర్ణపతకాన్ని అందుకున్నాడు. రెండు నెలల క్రితం త్యాగి 400, 100 మీటర్ల టీ12 విభాగాలలో బంగారు పతకాలు సాధించాడు. ఈ ఏడాది 48.42 సెకండ్లతో ఆసియా రికార్డును బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతలోనే హత్యకు గురి కావడం క్రీడా రంగాన్ని విషాదంలో ముంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+