ఎవరీ త్రిష..? తెలంగాణలో పుట్టి, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుందిగా..!
మలేషియా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.దీంతో రెండో సారి టీ20 విశ్వవిజేతగా భారత మహిళల టీం నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.
భారత్ విజయంలో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది.మొదట తన స్పిన్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపెట్టింది. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్ల పడగొట్టింది. అనంతరం త్రిష బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటింది. మ్యాచ్‌లో అజేయంగా 44 పరుగులు చేసింది.ఫైనల్‌లోనే కాదు టోర్నీ మొత్తం గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేసింది.

ఆమె టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది.మొత్తం ఏడు మ్యాచుల్లో 77 సగటుతో మొతకతం 309 పరుగులు సాధించింది.అంతేకాకుండా మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన రికార్డును తన పేరున నెలకొల్పింది.స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో త్రిష కేవలం 59 బంతుల్లోనే 110 పరుగులు సాధించింది.
దీంతో క్రికెట్ ప్రపంచంలో త్రిష పేరు మార్మోగిపోతుంది. గొంగడి త్రిష తెలంగాణకు చెందిన ఒక క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైంది. చిన్న వయసులోనే బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది. త్రిష ఒక లెగ్ స్పిన్నర్, బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కూడా ఆమె నెలకొల్పింది.












Click it and Unblock the Notifications