GT vs RR: ఫైనల్ కు ఛాన్స్ ఆ జట్టుకే, అక్కడే అసలు ట్విస్ట్..!!

GT vs RR qualifier 2 IPL 2026: ఐపీఎల్ ఫైనల్ కు చేరే రెండో జట్టు ఏది. ఇప్పటికే ఫైనల్ కు చేరి ఆర్సీబీ తమ ప్రత్యర్థి కోసం వెయిట్ చేస్తోంది. క్వాలిఫైర్ -2 లో గుజరాత్ టైటాన్స్ - రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది. రెండు జట్ల పైన భారీ అంచనాలు ఉన్నాయి. కాగా.. మాజీ క్రికెటర్లు మాత్రం ఈ మ్యాచ్ లో గెలుపు పైన తమ అంచనాలను వెల్లడిస్తున్నారు.

ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్‌కు ముందు చిట్టచివరి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య శుక్రవారం క్వాలిఫయర్‌-2 జరుగనుంది. ఈనెల 31న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగే ఫైనల్లో తలపడేందుకు ఇరు జట్లకిదే ఆఖరి అవకాశం. రాజస్థాన్‌ 2008 ఆరంభ సీజన్‌లో విజేతగా నిలవగా.. ఆ తర్వాత 2022లో మాత్రమే ఫైనల్‌కు రాగలిగింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలోనే పరాభవం ఎదురుకాగా.. నేడు ఆర్‌ఆర్‌కు బదులు తీర్చుకునే సమయం వచ్చింది. ఇక క్వాలిఫయర్‌ 1లో పేలవ ఆటతీరుతో ఆర్‌సీబీ చేతిలో చిత్తుగా ఓడిన టైటాన్స్‌కిది రెండో అవకాశం. ఇరు జట్లు ఓవరాల్‌గా 10 మ్యాచ్‌ల్లో తలపడగా 7-3తో గిల్‌ సేన ఆధిపత్యంలో ఉంది. ఈ సీజన్‌లో చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఏదిఏమైనా ఇదే మైదానంలో 29 బంతుల్లో 97 పరుగులు బాదిన వైభవ్‌ను టైటాన్స్‌ బౌలర్లు ఏమేరకు నిలువరిస్తానేది కీలకంగా మారనుంది.

 రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం..!!
రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం..!!
gujarat-titans-will-take-on-rajasthan-royals-in-ipl-2026-qualifier-2-with-a-place-in-the-final-at-st

వైభవ్ కట్టడి పైనే గుజరాత్ గురి

ఫైనల్‌కు దూసుకెళ్లాలంటే గుజరాత్‌ ఓపెనర్ల నుంచి మెరుపు ఆరంభం రావాల్సి ఉంటుంది. సాయి సుదర్శన్‌-శుభ్‌మన్‌ గిల్‌ నిలకడకు మారుపేరైనా.. వీరి ఆటలో టీ20 తరహా హిట్టింగ్‌ కనిపించదు. శుక్రవారం ఆ బలహీనతను అధిగమించాల్సి ఉంటుంది. క్వాలిఫయర్‌1లో టాపార్డర్‌ పూర్తిగా విఫలం కావడం దెబ్బతీసింది. తెవాటియాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపితే ప్రయోజనం ఉంటుంది. మిడిలార్డర్‌లో అండగా నిలిచే బ్యాటర్‌ లేకపోవడం లోపంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్‌ మాత్రం పకడ్బందీగానే ఉంది. ఆర్‌సీబీపై తేలిపోయినా.. ఓవరాల్‌గా వీరి ప్రదర్శన అద్భుతంగానే ఉంది. పేసర్‌ రబాడ (26), సిరాజ్‌ (17) స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (19) ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టగలరు. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, జేసన్‌ హోల్డర్‌ రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. కానీ నేటి మ్యాచ్‌లో వైభవ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగితేనే వీరికి గెలుపు అవకాశాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+