ప్రియురాలితో దొరికిపోయిన హార్థిక్ పాండ్యా..గ్రౌండ్‌లోనే ఫ్లయింగ్ కిస్ ..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచారు. భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్, ఆ తర్వాత భార్య నటాషాతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చాడు.
కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశం అయిన స్వీడన్‌కు వెళ్లిపోయారు.భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ , బాలీవుడ్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే, హార్దిక్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి.దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు.

దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరుచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అనన్య పాండే ఓ బాలీవుడ్ హీరోతో రిలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. దీంతో వీరి రిలేషన్ గురించి వచ్చిన రూమర్లకు తెరపడింది. మరోవైపు హార్దిక్ పాండ్యాకు సంబంధించి మరో ఎఫైర్ బయటకు వచ్చింది.హార్దిక్ ఓ సింగర్‌తో డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన ఓ వీడియోకు జాస్మిన్ వాలియా లైక్ కొట్టారు. సరిగ్గా ఇదే ప్లేస్ లో వాలియా కూడా ఫొటో దిగి ఇన్ స్టాలో షేర్ చేయగా.. ఈ పోస్టుకు పాండ్యా లైక్ కొట్టాడు. దీంతో వీరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్యా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా పాకిస్థాన్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లో కూడా జాస్మిన్ వాలియా సందడి చేసింది.పాండ్యా బౌలింగ్ వేస్తోన్న సమయంలో కెమెరా మ్యాన్ పలుమార్లు జాస్మిన్ వాలియాను చూపించడం జరిగింది.పాండ్యా వికెట్ తీసిన సమయంలో ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కనిపించింది. దీంతో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయ్యారు.ఈ ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. పాండ్యా కోసమే జాస్మిన్ వాలియా, మ్యాచ్‌కు వచ్చి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి దీనిపై హార్దిక్ పాండ్యా ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.












Click it and Unblock the Notifications