Hardik Pandya:పాండ్యా లేని లోటు .. ఉండి ఉంటే లెక్క మరోలా ఉండేదా..?
Hardik Pandya:ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో టీమిండియా పరాజయంకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముందుగా బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో రోహిత్ సేన ఫెయిల్ కాగా... ఇంకా ఈ ఓటమికి చాలా కారణాలున్నాయి. కొన్ని సెంటిమెంట్ పరంగా భారత్‌కు కలిసిరాలేదు. అంతేకాదు జట్టులో ఆరవ బౌలర్ అందుబాటులో లేకపోవడం కూడా టీమిండియా కొంప ముంచిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మిస్ అయిన ఆ ఆరవ బౌలర్ ఎవరు..?
హార్థిక్ పాండ్యా... ఈ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇతగాడు ఫీల్డ్‌లోకి దిగాడంటే దుమ్ము రేగొడతాడనే అభిప్రాయం ఉంది. అయితే హార్థిక్ పాండ్యా గాయం కారణంగా కీలకమైన ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. హార్థిక పాండ్యా కనుక ఫైనల్స్‌లో ఆడి ఉంటే లెక్క మరోలా ఉండేదని క్రికెట్ పండితులతో పాటు ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

హార్థిక్ పాండ్యా గుజరాత్‌కు చెందిన ఆటగాడు. లోకల్ బాయ్ కావడంతో ఆ లెక్క మరోలా ఉంటుంది. పైగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్థిక్ పాండ్యాకు మంచి రికార్డ్ ఉంది. టీమిండియా కష్టకాలంలో ఉన్నసమయంలో ఇటు బ్యాట్‌తోను అటు బంతితోను ఈ ఆల్‌రౌండర్ సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఇలాంటి కీలక మ్యాచ్‌లో హార్థిక్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.
అక్టోబర్ 19వ తేదీన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో కాలికి గాయం అవడంతో ఈ స్టార్ ఆల్‌రౌండర్ జట్టుకు దూరమయ్యాడు. ఎనిమిది వారాల పాటు పాండ్యా రెస్ట్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. హార్థిక్ పాండ్యా ఉండి ఉంటే ఆరో బౌలర్‌గా జట్టులో కీలకంగా మారేవాడని అదే సమయంలో తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ పిచ్ పై బ్యాట్ ఝుళింపించేవాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆడిన మూడు మ్యాచుల్లోను హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రాణించాడు.అంతేకాదు నిన్న పాండ్యా ఉండి ఉంటే జడేజా కంటే ముందే బ్యాటింగ్‌కు వచ్చి చేయాల్సిన రిపేర్లు చేసేవాడని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఆరో బౌలర్‌గా ఆసీస్ పతనం శాసించేవాడని దీంతో భారత్ ఫైనల్స్ గెలిచేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications