శుభ్‌మన్ గిల్ వరల్డ్ రికార్డు బ్రేక్!

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు యువ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వన్డే క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో నూతన శకానికి నాంది పలికాడు. పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ట్రై-సిరీస్ మూడో వన్డే మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్ విధ్వంసంతో చెలరేగిపోయి చారిత్రాత్మక డబుల్ సెంచరీని బాదాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేయడంతో వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచి సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.

IND vs NZ: చివరి ఓవర్లలో అసలైన ట్విస్ట్.. కివీస్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
IND vs NZ: చివరి ఓవర్లలో అసలైన ట్విస్ట్.. కివీస్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!

ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లపై హ్యారీ బ్రూక్ ఏమాత్రం కనికరం చూపకుండా విరుచుకుపడ్డాడు. కేవలం 114 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ వన్డే డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్టేడియంలో నలువైపులా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సాగిన ఈ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ మొత్తం 21 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. కేవలం 96 బంతుల్లోనే 150 పరుగుల మార్కును దాటి హ్యారీ బ్రూక్.. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించి 116 బంతుల్లో 202 పరుగులు చేసి ఔటయ్యాడు.

Harry Brook Smashes Fastest ODI Double Century in 114 Balls Breaks Shubmab Gill Record Full Details Here

గిల్ రికార్డు బ్రేక్!
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో హ్యారీ బ్రూక్ భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టాడు. గతంలో శుభ్‌మన్ గిల్ 117 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా.. హ్యారీ బ్రూక్ ఇప్పుడు 114 బంతుల్లోనే ఆ ఘనత సాధించి వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతే కాకుండా ఇంగ్లండ్ వన్డే చరిత్రలో బెన్ స్టోక్స్(182 పరుగులు) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు.

బేబీ‌బాస్‌కు మళ్లీ నిరాశే.. వరల్డ్ కప్ హీరో బెంచ్‌కే.. ఇద్దరు యువ స్టార్లకు ఛాన్స్!
బేబీ‌బాస్‌కు మళ్లీ నిరాశే.. వరల్డ్ కప్ హీరో బెంచ్‌కే.. ఇద్దరు యువ స్టార్లకు ఛాన్స్!

వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(264, 209, 208*), మార్టిన్ గప్టిల్(237*), వీరేంద్ర సెహ్వాగ్(219), క్రిస్ గేల్(215), ఫఖర్ జమాన్(210*), ఇషాన్ కిషన్(210), పాతుమ్ నిస్సాంక(210*), శుభ్‌మన్ గిల్(208), గ్లెన్ మాక్స్ వెల్(201*), సచిన్ టెండూల్కర్(200*) సరసన ఇప్పుడు హ్యారీ బ్రూక్ చేరిపోయాడు. కాగా వన్డేలలో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్రపంచ రికార్డు ఇప్పటికీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిటే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+