ఆర్సీబీ విజయం వెనుక ఆపరేషన్ సింధూర్- అసలు విషయం బయట పెట్టిన కోచ్..!!
ఎట్టకేలకు 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. "ఈసాలా కప్ నమదే" అనే మాటను నిజం చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి టైటిల్ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీ ఆద్యంతం అలరించిన ఆర్సీబీ, ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించి కప్ అందుకుంది. అయితే, ఈ విజయం వెనుక ఎన్నో ఆసక్తి కర అంశాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఆర్సీబీ విజయానికి కీలకంగా నిలిచింది. ఇదే విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ వెల్లడించారు.
ఈ సారి ఆర్సీబీ పైన తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల ఆశలు వమ్ము చేయ కుండా ఆర్సీబీ టైటల్ విజేతగా నిలిచింది. కాగా, ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవటం వెనుక అనేక ఆసక్తి కర అంశాలు ఉన్నాయి. ఈ టోర్నీ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ కారణం తో టోర్నీ దాదాపు వారం రోజులు వాయిదా పడింది. ధర్మశాల స్టేడియంలోని జరగుతున్న పంజాబ్ - దిల్లీ మ్యాచ్ (మే 8) అర్ధరతరంగా రద్దుచేసారు. ఆ తర్వాత బీసీసీఐ చివరి దశకు చేరిన ఐపీఎల్ ను వాయిదా వేసింది. వారం రోజుల విరామం తర్వాత మళ్లీ మ్యాచ్ ల నిర్వహణ కు వీలుగా షెడ్యూల్ ఖరారు చేసింది. సరిగ్గా, ఆ విరామమే ఆర్సీబీకి వరంగా మారింది. ఇదే విషయా న్ని స్వయంగా ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ తెలిపారు.

ఆపరేషన్ సింధూర్ కారణంగా వచ్చిన విరామమే తమ జట్టులో కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు గాయా ల నంచి కోలుకొని తిరిగి రావటానికి అవకాశం ఇచ్చిందని ఆండీ ఫ్లవర్ చెప్పారు. లీగ్ మధ్యలో వచ్చిన బ్రేక్ లోనే తమ టీం కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం నుంచి కోలుకున్నాడని. స్టార్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ తన గాయం నుంచి రికవర్ అయ్యాడని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ కారణంగా బీసీసీఐ కొన్ని కారణాల వల్ల తీసుకున్న వాయిదా నిర్ణయం తమకు వరమైందని ఆండీ చెప్పారు.

విధిని నమ్మేవారికి ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటుందన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత వచ్చిన బ్రేక్ తమకు కొంచెం ఊపిరి పీల్చుకునే టైమ్ ఇచ్చిందన్నారు. సీజన్ మధ్యలో రజిత్ పాటిదార్ తిరిగి రావడం ద్వారా బ్యాటింగ్ లో బలం పెరిగిందని.. కెప్టెన్ గా అదరగొట్టాడని ప్రశంసించారు. ఒత్తిడి లో కూడా మంచ నిర్ణయాలు తీసుకున్నాడని రజిత్ పైన ఆండీ ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications