SRH డేంజరస్ ప్లేయర్‌కు బిగ్ షాక్.. టీం నుంచి గెట్ అవుట్
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు హెన్రిచ్ క్లాసెన్‌కు షాక్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) 2025-26 సీజన్‌కు గాను ప్రకటించిన ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ పేరు లేదు. క్లాసెన్ టెస్ట్ క్రికెట్ నుండి ఇదివరకే రిటైర్ అయ్యాడు. అతను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న T20 లీగ్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగానే అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.టీ20 ప్లేయర్‌గా క్లాసెన్‌కు మంచి గుర్తింపు ఉంది.
అయితే క్లాసెన్ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. వన్డే, టీ20ల్లో పెద్ద ప్రభావం చూపించలేపోతున్నాడు. ఈ కారణంగానే అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తప్పించినట్టు తెలుస్తోంది.వన్డే , టీ20ల జాబితాలో కూడా క్లాసెన్ పేరు లేకపోవడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. ఈ లీగ్‌లు సౌత్ ఆఫ్రికా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కూడా ఉండవచ్చు.CSA డేవిడ్ మిల్లర్ , రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌లకు హైబ్రిడ్ కాంట్రాక్టులను ఇచ్చింది. ఈ కాంట్రాక్టు ద్వారా వారు కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు , ICC టోర్నమెంట్‌లకు అందుబాటులో ఉంటారు.

మిగిలిన సమయాల్లో లీగ్‌లలో ఆడవచ్చు. అయితే క్లాసెన్‌కు ఇలాంటి ఆఫర్ ఇచ్చారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.CSA ఒక ప్రకటనలో క్లాసెన్ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం త్వరలో తీసుకుంటామని తెలిపింది. దీంతో అతను పూర్తిగా కాంట్రాక్ట్ నుండి తొలగించబడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్లాసెన్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో క్లాసెన్ కీలక ఆటగాడుగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ వేలంలో రూ.23 కోట్లకు సన్‌రైజర్స్ అతన్ని రిటైన్ చేసుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం వరుస ఓటములతో డీలా పడింది. క్లాసెన్ కూడా పెద్దగా రాణించకలేకపోతున్నాడు. ఇటువంటి తరుణంలోనే సొంత జట్టులో అతను స్థానం కోల్పోవడం సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications