ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్..గాయంతో స్టార్ ప్లేయర్ అవుట్..?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరో వైపు రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది.
దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.ఇదిలా ఉంటే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలుకు గాయం అయింది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది.

ఆ తర్వాత హార్దిక్ పరుగులు సాధించడంలో కొంత ఇబ్బంది పడినట్టు కనిపించాడు.అయితే ఆ తర్వాత అద్భుతమైన సిక్స్‌లతో మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు.గతంలో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు అది మళ్లీ తిరగబెడుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఒకవేళ గాయం తీవ్రతరమైనది అయితే కనుక ఫైనల్ మ్యాచ్‌కు అతను దూరం కావాల్సి ఉంటుంది. ఇది ఫైనల్‌కు ముందు భారత జట్టు ఆందోళనలను పెంచుతుంది.అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications