RCB ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే నా భర్తకు విడాకులిస్తా..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. "ఈ సాల కప్ నమ్దే" (ఈసారి కప్పు మనదే) అనే నినాదంతో ప్రతి సీజన్‌లోనూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.
ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో RCB తన జైత్రయాత్రను కొనసాగుతోంది. ఈ సీజన్‌లో అంచనాలకు మించి ఆ జట్టు రాణిస్తుంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవడమే కాకుండా,క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో పంజాబ్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా కప్ కొట్టాలనే కసి RCB ఆటగాళ్లలో కనిపిస్తోంది.

దీనిలో భాగంగానే ఓ లేడీ ఫ్యాన్ ప్రదర్శించిన ఫ్లకార్డు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అందులో "RCB కప్పు గెలవకపోతే నా భర్తకు విడాకులు ఇచ్చేస్తా" అని రాసి ఉంది. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Remember RCB..
— Byomkesh Bakshi (@_Byomkesh) May 29, 2025
Play Bold..
Otherwise this divorce will be on you..#Playoffs #RCBvsPBKS #PBKSvsRCB pic.twitter.com/5lFnomK4lA
ఈ ప్లకార్డ్‌పై కొందరు నెటిజన్లు ఫన్నీగా "డివోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు" అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఆమె భర్త అదృష్టవంతుడు అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అభిప్రాయపడుతున్నారు.
मैच के समय स्टेडियम में आई हुई एक महिला पोस्टर पे लिख कर दिखाती है कि RCB अगर फाइनल नही जीती तो मैं अपने पति को तलाक दे दूंगी
— आलोक यादव बाऊजी (@alokyadav0070) May 29, 2025
लेकिन ये गलत बात है मैच जीतना हारना अपनी जगह है
और रिश्ता अपनी जगह है
लेकिन अबकी बार लग रहा है rcb फाइनल जीतेगी #ViratKohli𓃵 #viratkohliretirement pic.twitter.com/NvpbHwihel
ఏది ఏమైనా, ఈ ప్లకార్డ్ RCB అభిమానుల ఉత్సాహానికి, నిరీక్షణకు అద్దం పడుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్‌కు RCB చేరుకుంది. ఈసారి ట్రోఫీ గెలిచి తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందో లేదో చూడాలి.
RCB టైటిల్ గెలవకపోతే భర్తకు విడాకులిస్తా: లేడీ ఫ్యాన్#RCBFans #ViratKohli #PBKSvsRCB #RCBvsPBKS #IPL2025 #RoyalChallengersBengaluru #IPLwithMykhel #SportsUpdates #MKTelugu pic.twitter.com/4HAhrZoJ9m
— MyKhel Telugu (@myKhelTelugu) May 30, 2025












Click it and Unblock the Notifications