Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాక్‌పాట్ కొట్టిన సిరాజ్..!!

ICC latest test rankings 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. కొద్దిసేపటి కిందటే టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ కేటగిరీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన క్రికెటర్ల పేర్లు ప్రకటించింది.

బ్యాటింగ్ కేటగిరీలో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నారు. ఆ ఇద్దరూ.. టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. వీరిద్దరూ కూడా 5, 8 స్థానాల్లో నిలిచారు. వీరిద్దరి మధ్య ఉన్న పాయింట్లల్లో భారీ తేడా కనిపించింది. జైస్వాల్‌కు ఉన్న పాయింట్ల సంఖ్య 792. కాగా రిషభ్ పంత్ ఖాతాలో 768 పాయింట్లు ఉన్నాయి.

ICC latest test rankings 2025 Siraj and Prasidh Krishna achieved career-best

ఇంగ్లాండ్‌కు చెందిన బ్యాటింగ్ సంచలనం జో రూట్ అగ్రస్థానాన్ని అధిరోహించాడు. మొత్తం 908 పాయింట్లను అందుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. మిగిలిన వారిలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. రూట్ సాధించన పాయింట్లు 868. న్యూజిలాండ్ మాజీ కేప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో కొనసాగుతోన్నాడు. అతను అందుకున్న పాయింట్లు 858.

816 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో నిలిచాడు. తన జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణాఫ్రికా కేప్టెన్ టెంబా బావుమా 790 పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్నాడీ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లల్లో.

శ్రీలంకకు కమిందు మెండిస్ 781 పాయింట్లతో ఏడు, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ 748 పాయింట్లతో తొమ్మిది, 747 పాయింట్లతో ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ డారిల్ మిఛెల్ పదో స్థానాల్లో ఉన్నారు.

టెస్ట్ ర్యాంకింగ్ బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ పొజీషన్‌లో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య 889. రెండో స్థానంలో కగిసొ రబడ (దక్షిణాఫ్రికా)- 851, పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 838, మాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 817 ఉన్నారు. జోష్ హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా)- 815 పాయింట్లతో తొలి అయిదు స్థానాలో ఉన్నారు.

ఆ తరువాత నొమన్ అలీ (పాకిస్తాన్)- 806, స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా)- 784, నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)- 769, మార్కొ జెన్ సెన్ (దక్షిణాఫ్రికా)- 767, మిఛెల్ స్టార్క్ (766) తొలి 10 స్థానాలో నిలిచారు.

ఇంగ్లాండ్ తో జరిగిన అయితో టెస్ట్ మ్యాచ్ లో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్.. 15వ స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్ ఆరంభం కావడానికి ముందు అతని స్థానం 27. ఈ సిరీస్ లో 23 వికెట్లతో సత్తా చాటడం అతనికి కలిసొచ్చింది. ఏకంగా 12 పాయింట్లను అధిగమించి.. 15 స్థానానికి చేరుకున్నాడు. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకోగలిగాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+