T20 World Cup 2024: అగ్నికి వాయువు తోడైనట్టే: జట్టు కూర్పు ఇలా ఉంటే..
ముంబై: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియాకు తొలి పరాభవం ఎదురైంది. విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిందా జట్టు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయిదు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది.
టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బౌలర్లు సమష్టిగా విఫలం అయ్యారీ మ్యాచ్‌లో. ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ము రేపారు. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సెంచరీతో కదం తొక్కాడు. 50 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లతో 110 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 19.5 ఓవర్లల్లో ఈ టార్గెట్‌ను ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కొత్త సారథి సూర్యకుమార్ యాదవ్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. కేప్టెన్సీ ఒత్తిడి ఉన్నప్పటికీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్- 58 పరుగులతో అతనికి అండగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్ (Rinku Singh) మరోసారి సత్తా చాటాడు. బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. ధోని తరువాత మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. 14 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎలాంటి ఒత్తిడిలో అయినా, ఏ పొజిషన్‌లో అయినా, ఎలాంటి మ్యాచ్‌ను అయినా గెలిపించే సత్తా ఉన్నోడిగా అభిమానులు అతణ్ని ఆకాశానికెత్తుతున్నారు.
వచ్చే సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 (ICC T20 World Cup 2024) ఆడే జట్టులో రింకూ సింగ్‌కు స్థానం ఖాయమౌతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మ్యాచ్ విన్నర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్‌ను జట్టులో తీసుకోవాలంటూ అభిమానులు ఇప్పటి నుంచే బీసీసీఐకి సూచనలు చేస్తోన్నారు.

రింకూతో పాటు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ వంటి యంగ్ క్రికెటర్లు, టీ20 స్పెషలిస్టులతో టీ20 వరల్డ్ కప్ 2024 ఆడే జట్టును ఎంపిక చేయాలని చెబుతున్నారు. ఈ ముగ్గురూ కూడా నిలకడగా రాణిస్తోండటాన్ని ఉదహరిస్తోన్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లకు శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, రిషభ్ పంత్.. వంటి ప్లేయర్లు జత కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టే అవుతుందని, శతృదుర్భేద్ధ్యంగా మారుతుందని అభిమానులు అంచనా వేస్తోన్నారు.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications