రఫ్ఫాడించిన బోలాండ్..
Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. కొద్దిసేపటి కిందటే టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ కేటగిరీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన క్రికెటర్ల పేర్లు ప్రకటించింది. ఇందులో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నారు.
ఆ ఇద్దరూ టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. వీరిద్దరూ కూడా 4, 9 స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియాతో అయిదు టెస్ట్ మ్యాచ్‌లతో కూడిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు 9వ స్థానంలో నిలిచిన రిషభ్ పంత్ ఆ తరువాత దిగజారాడు. 11వ స్థానానికి పడిపోయాడు.

బీజీటీ సిరీస్‌లో ది బెస్ట్ అనిపించుకున్న నేపథ్యంలో మళ్లీ మూడు స్థానాలు ఎగబాకాడు. మరోసారి టాప్ 10లో చేరాడు. 9వ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న పాయింట్లల్లో భారీ తేడా కొనసాగుతోంది. జైస్వాల్‌కు ఉన్న పాయింట్ల 847. కాగా రిషభ్ పంత్ ఖాతాలో 739 పాయింట్లు ఉన్నాయి.
ఇంగ్లాండ్‌కు చెందిన బ్యాటింగ్ సంచలనం హ్యారీ బ్రూక్ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. అదే జట్టుకు చెందిన జో రూట్ మళ్లీ టాప్‌లో నిలిచాడు. మొత్తం 895 పాయింట్లను అందుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ 867 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.
న్యూజిలాండ్ మాజీ కేప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో కొనసాగుతోన్నాడు. అతను అందుకున్న పాయింట్లు 867. 772 పాయింట్లతో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అయిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా కేప్టెన్ టెంబా బావుమా ఆరో స్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో ఉన్న పాయింట్లు 769. ఒకేసారి మూడు స్థానాలు ఎగబాకాడీ డాషింగ్ కేప్టెన్.
శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ 759 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. గతంతో పోల్చుకుంటే ఒక మెట్టుపైకెక్కాడు కమిందు. 746 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఎనిమిదవ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిఛెల్ 725 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచారు.
టెస్ట్ ర్యాంకింగ్ బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ పొజీషన్‌లో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య 908. జస్‌ప్రీత్ బుమ్రా కేరీర్‌లోనే అత్యత్తమ రేటింగ్ ఇది. ఈ స్థాయిలో పాయింట్లను సొంతం చేసుకున్న ఫాస్ట్ బౌలర్ మరొకరు లేరు.
రెండో స్థానంలో కపాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 841, కగిసొ రబడ (దక్షిణాఫ్రికా)- 837, జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 835, మార్కొ జన్‌సెన్ (దక్షిణాఫ్రికా)- 785 పాయింట్లతో తొలి అయిదు స్థానాలో ఉన్నారు.
ఆ తరువాత మాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 782, నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)- 774, ప్రభాత్ జయసూర్య (శ్రీలంక)- 768, రవీంద్ర జడేజా (భారత్)- 745 స్థానాలో టాప్ 10లో ఉన్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాటింగ్‌ను రఫ్ఫాడించిన ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు ఎగబాకాడు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో ఎక్కడో 39వ స్థానంలో ఉన్న బోలాండ్.. ఉన్నట్టుండి 10వ స్థానానికి దూసుకొచ్చాడు. సరిగ్గా 745 పాయింట్లతో రవీంద్ర జడేజా సరసన నిలిచాడు. ఈ సిరీస్‌లో అతను మొత్తం 21 వికెట్లను నేలకూల్చాడు. టీమిండియా సిరీస్ ఓడిపోవడానికి ప్రధాన కారకుడయ్యాడు.












Click it and Unblock the Notifications