ప్రపంచ కప్‌ 2023లో నేడు కీలక మ్యాచ్: ఐపీఎల్ ప్లేయర్లపైనే ఫోకస్..!!

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. భారత్ తరువాత న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

టీమిండియా ప్రదర్శిస్తోన్న ఈ దూకుడు చూస్తోంటే- నాలుగో విజయం సునాయాసమే అవుతుంది. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. ఈ నెల 19వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. పుణేలో జరుగుతుందీ గేమ్.

 ENG vs AFG: England eyes on another victory

వరల్డ్ కప్ 2023లో భాగంగా నేడు ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా అపజయాలను ఎదుర్కొంటోన్న ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లకూ ఇది మూడో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవి చూసిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తన మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌తో తలపడనుంది.

ఆఫ్ఘనిస్తాన్ దీనస్థితిలో ఉంది. ఇప్పటివరకూ బోణీ కొట్టలేదా జట్టు. తొలి రెండు మ్యాచ్‌లల్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. భారత్, బంగ్లాదేశ్ చేతుల్లో మట్టికరిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. తన కంటే ఎంతో బలమైన ఇంగ్లాండ్‌పై ఎంతవరకు గెలుస్తుందనేది అనుమానమే. హ్యాట్రిక్ పరాజయాలను అందుకునే అవకాశం ఆఫ్ఘన్‌కు లేకపోలేదు.

Afghanistan players walk off the field

ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లల్లో ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు ఉన్నారనే విషయం తెలిసిందే. వారందరూ మ్యాచ్ విన్నర్లే. ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద ఆయా జట్ల ప్లేయర్లు ఏ స్థాయిలో ఆడతారనేది ఆసక్తి రేపుతోంది.

ఇంగ్లండ్ తుదిజట్టులో- జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లే ఆడొచ్చు. ఆఫ్ఘన్‌లో- రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కేప్టెన్), అజ్మతుల్లా ఒర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజుల్‌ హక్ ఫారూఖీ ఆడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+