Salman Khan: వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆ జట్టు గెలుస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పిన కండలవీరుడు

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.

ఇక ఫైనల్స్‌లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.

ICC World Cup 2023 finals: Salman Khan expressed confidence that Team India will win the title

బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.

రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో కట్టి పడేస్తోన్నారు. స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని బ్యాటర్లకు ఇవ్వట్లేదు. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తోన్నారు ప్లేయర్లు. స్టేడియంలో పాదరసంలా కదులుతున్నారు. మెరుపు వేగంతో క్యాచ్‌లను అందుకుంటోన్నారు.

ఈ వరల్డ్ కప్ ఫైనల్స్‌పై ఎవరి అంచనాలు వారు వ్యక్తం చేస్తోన్నారు. గెలుపోటములపై జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీలు, లెజెండరీ ప్లేయర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఫైనల్స్‌లో ఏ జట్టు గెలుస్తుందనే విషయంపై విశ్లేషణలను అందించారు. దానికి గల కారణాలనూ వివరించారు.

ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) జాయిన్ అయ్యారు. ఆదివారం జరిగే ఫైనల్స్ విజేత ఎవరో జోస్యం చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు. మరోసారి భారత్ వరల్డ్ క్రికెట్ ఛాంపియన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వరల్డ్ కప్‌లో భారత్ ఎలా ఆడుతున్నదో అందరూ చూశారని, ఛాంపియన్‌గా నిలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని సల్మాన్ ఖాన్ అన్నారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ కొనసాగుతున్న సమయంలో టైగర్ 3 (Tiger 3)తో ముందుకు వచ్చామని, ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టిందని పేర్కొన్నారు. భారత్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను గెలుచుకున్న తరువాత మరోసారి థియేటర్‌లకు రావాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+