పాక్ క్రికెటర్ వివాదం: రెండో పెళ్లిపై మౌనం వీడిన సానియా!
పాకిస్థానీ క్రికెటర్ ఇమాద్ వసీం, ఆయన మాజీ భార్య సానియా అష్ఫాక్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తానీ క్రికెటర్ ఇమాద్ వసీం మాజీ భార్య, సానియా అష్ఫాక్ కొంతకాలంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వదంతులు వస్తున్నాయి. పెళ్లికూతురి దుస్తుల్లో ఉన్న తన వీడియోలు, ఫోటోలను ఆమె పంచుకున్న తర్వాత, ఆమె రెండో పెళ్లి పుకార్లు మరింత ఊపందుకున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై సానియా స్వయంగా మౌనం వీడింది.
రెండో పెళ్లి పుకార్లపై సానియా స్పందన
సానియా అష్ఫాక్ 'కుచ్ మజేదార్ సి బాతేన్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెను తన రెండో పెళ్లి వివాహం గురించి ప్రశ్నించారు. పెళ్లి దుస్తులలో "ఖుబూల్ హై" అని ఎందుకు అంటున్నారని సానియాను అడిగారు. ఆమె రెండో వివాహం వెనుక ఉన్న నిజం ఏమిటి?

సానియా నవ్వి.. "నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విషయాలు పోస్ట్ చేయడం లేదు. వాటిపై దిష్టి లేదా చేతబడి ప్రభావం పడొచ్చని నేను అనుకుంటున్నాను. అందుకే వాటిని నాలోనే ఉంచుకుంటాను. ప్రస్తుతానికి ఈ విషయాన్ని నాలోనే ఉంచుకోవాలనుకుంటున్నాను" అని బదులిచ్చింది. సానియా అష్ఫాక్ తన రెండో వివాహాన్ని ధ్రువీకరించనప్పటికీ.. దానిని ఖండించనూ లేదు. ఆమె మాటలను బట్టి ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె ఈ పెళ్లిని మీడియాకు దూరంగా ఉంచాలనుకుంటోంది.
క్రికెటర్ ఇమాద్ వసీంపై సానియా ఆరోపణలు
సానియా అష్ఫాక్ తన మాజీ భర్త, క్రికెటర్ ఇమాద్ వసీం గురించి కూడా అనేక సంచలన విషయాలు వెల్లడించారు. తాను మూడోసారి గర్భవతిగా ఉన్న సమయంలో అత్తగారికి ఆ బిడ్డ పుట్టడం ఇష్టం లేదని వెల్లడించారు. తన తల్లి ఒత్తిడికి తలొగ్గి వరల్డ్ కప్ మ్యాచ్‌లు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు మూడో బిడ్డకు సిద్ధంగా లేనని చెప్తూ ఇమాద్ వసీం తన బలవంతంగా అబార్షన్ చేయించాడని సానియా ఆరోపించారు.
మోసం, విడాకుల వ్యవహారం
అత్తగారి ఇంట్లో గొడవలు పెరగడంతో ఇమాద్ తనను, పిల్లలను లండన్‌లోని పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడని సానియా పేర్కొన్నారు. ఆ సమయంలో తాను మళ్లీ గర్భవతిగా ఉన్నానని.. కానీ ఇమాద్ తనను తీవ్రంగా మోసగించి విడాకులు ఇచ్చి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇమాద్ వసీం రెండో పెళ్లి
కాగా పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం 2026 ఫిబ్రవరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నైలా రాజాను రెండో వివాహం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మొదటి భార్యను, ముగ్గురు పిల్లలను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నందుకు ఇమాద్ నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇమాద్ తన రెండో భార్య నైలా రాజాతో కలిసి నివసిస్తున్నారు.
#SanniaAshfaq opened up about her divorce from #ImadWasim, alleging he laughed while giving her the divorce as their children cried. She also claimed he hadn’t met their two-month-old baby before meeting his second wife, #NylaRaja.
— Chaudhry Tabraiz Aurah (@TabraizAurah) August 29, 2026
@kmbwithshahnilahpodcast#ImadWasim #NylaRaja pic.twitter.com/Tq6oO4SMDa














Click it and Unblock the Notifications