జైలులో ఇమ్రాన్ ఖాన్.. రెండో పెళ్లి చేసుకున్న మాజీ భార్య!
పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్(52) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ బ్రిటీష్ చిత్ర నిర్మాత, రచయిత్రి అయిన జెమీమా.. ఐరిష్-ఆస్ట్రేలియన్ మల్టీ-మిలియనీర్ ఫైనాన్షియర్ కామెరాన్ ఓ రైల్లీని రెండో వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా గోప్యంగా ఉన్న వీరి ప్రేమబంధం ఇటీవల వివాహబంధంగా మారింది.
సినిమాలు, డాక్యుమెంటరీల ద్వారా పరిచయం
జెమీమా, కామెరాన్ ఓ రైల్లీల పరిచయం కొన్ని సినిమాలు, డాక్యుమెంటరీ ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్న సమయంలో ఏర్పడింది. కామెరాన్ కొన్ని డాక్యుమెంటరీలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది కాస్తా గతేడాది కాలంగా ప్రేమగా మారింది. కామెరాన్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి కావడంతో జెమీమా కూడా ఈ సంబంధాన్ని దాదాపు ఓ సంవత్సరం పాటు మీడియా కంటపడకుంజా చాలా రహస్యంగా ఉంచారు.

ఎవరీ కామెరాన్ ఓ రైల్లీ?
62 ఏళ్ల కామెరాన్ ఓ రైల్లీ దివంగత మీడియా రారాజు, అంతర్జాతీయ రగ్బీ క్రీడాకారుడు సర్ ఆంథోనీ ఓ రైల్లీ కుమారుడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన కామెరాన్, తొలినాళ్లలో తన తండ్రికి చెందిన మీడియా సంస్థల్లో కీలక పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 2003లో బేయాల్డ్ క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థను స్థాపించారు. స్విస్ మీటరింగ్ కంపెనీ 'లాండిస్+గైర్'ను కొనుగోలు చేసి దాని సీఈవోగా పనిచేసి 2011లో తోషిబా కంపెనీకి దాదాపు 2.3 బిలియన్ డాలర్లకు విక్రయించి బిలియనీర్‌గా ఎదిగారు. కామెరాన్‌కు గత వివాహం ద్వారా నలుగురు పిల్లలు ఉన్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం
లండన్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరువర్గాల అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. జెమీమా సోదరుడు బెన్ గోల్డ్ స్మిత్ ఈ పెళ్లిని ధ్రువీకరించగా.. ఆయన భార్య జెమీమా జోన్స్ సోషల్ మీడియా వేదికగా 'ఎంతో సంతోషకరమైన రోజు' అని పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్‌తో గత వివాహ బంధం
జెమీమా గోల్డ్‌స్మిత్ 1995లో తన 21వ ఏట ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. 9 ఏళ్ల పాటు సాగిన వీరి వైవాహిక బంధం 2004లో విడిపోవడంతో ముగిసి, 2005లో అధికారికంగా విడాకులు పొందారు. వీరికి సులేమాన్, ఖాసిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇమ్రాన్ నుంచి విడిపోయిన తర్వాత జెమీమా పేరు హ్యూ గ్రాంట్, రస్సెల్ బ్రాండ్ వంటి ప్రముఖుల సరసన వినిపించినప్పటికీ.. కామెరాన్ తోనే ఆమె రెండో పెళ్లి పీటలు ఎక్కారు.
జైలులో ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యం
జెమీమా మళ్లీ పెళ్లి చేసుకున్న ఈ సమయంలోనే ఆమె మాజీ భర్త, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అవినీతి కేసుల్లో పాకిస్తాన్‌లోని అడియాలా జైలులో ఉన్నారు. జైలులో ఆయన పరిస్థితి క్షీణిస్తోందని, కంటిలో రక్తం గడ్డకట్టడం వల్ల కుడి కంటి చూపు దాదాపు 85 శాతం దెబ్బతిందని నివేదికలు చెబుతున్నాయి. జెమీమా తన సొంత జీవితంలో ముందడుగు వేసినప్పటికీ..తన ఇద్దరు కుమారులతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని, ఆయనకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని బ్రిటీష్ ప్రభుత్వానికి, అంతర్జాతీయ సమాజానికి నిరంతరం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.
Jemima Goldsmith marries Cameron O'Reilly .Many many congrats both of you. pic.twitter.com/HlHBLnKayq
— MJKhan (@mjkhanlovelypk1) September 14, 2026













Click it and Unblock the Notifications
