ICC Test Rankings :టాప్ లో బూమ్రా, జైశ్వాల్ - కోహ్లీ స్థానమెంత..!!
అద్భుతమైన ఫాంలో ఉన్న టీం ఇండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బూమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి స్థానానికి చేరారు. పెర్త్ టెస్టు వరకు బూమ్రా మూడో స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో టాపర్ గా నిలిచారు. ప్రస్తుతం బుమ్రా 883 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగా, 825 పాయింట్లతో జైస్వాల్ రెండు ర్యాంకులు పైకి వచ్చి రెండో స్థానాన్ని సాధించారు. మొత్తం ఈ సారి ర్యాంకింగ్స్ లో టీం ఇండియా ఆటగాళ్లు తమ ర్యాగింగ్స్ ను మెరుగు పర్చుకొని తమ స్థానాలను పదిలం చేసుకున్నారు.
ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకులను విడుదల చేసింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అద్బుతంగా రాణిస్తున్న టీం ఇండియా ప్లేయర్లు తమ ర్యాంకులను మెరుగు పర్చుకున్నారు. పెర్తు టెస్టులో ఆసీస్‌పై అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిని బూమ్రా.. ఇప్పుడు తిరిగి ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. బూమ్రా తరువాతి స్థానాలో కగిసో రబాడ (872), జోష్ హేజిల్‌వుడ్ (860) కొనసాగుతున్నారు. ఇక, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (807) ఒక స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరాడు. కాగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు. ఇక..ఆస్ట్రేలియాలో తొలి టెస్టులోనే రికార్డు క్రియేట్ చేసిన యశస్వి జైస్వాల్ సైతం ఈ సారి ర్యాంకుల్లో తన సత్తా చాటాడు.

తాజా ర్యాంకింగ్స్ లో 825 పాయింట్లతో జైస్వాల్ రెండు ర్యాంకులు పైకి వచ్చి రెండో స్థానాన్ని సాధించాడు. ఇక, 903 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతు న్నాడు. ఐపీఎల్ లో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్లేయర్ గా రికార్డులు తిరగరాసిన రిషభ్ పంత్ (736) ఆరో స్థానానికి పరిమితం అయ్యాడు. అదే విధంగా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ 689 పాయింట్లతో ఏకంగా 9 స్థానాలకు ఎగబాకి.. ప్రస్తుతం 13వ ర్యాంకులో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లుగా టీమ్ఇండియా స్టార్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు.
జడేజా 423 పాయింట్లతో.. 290 పాయింట్లతో అశ్విన్ తొలి రెండు స్థానాలను సొంతం చేసుకున్నారు. టాప్ -10లో ఏడో స్థానంలో అక్షర్ పటేల్ (239) ఉండగా.. వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్-5లోనే మన టీం ఇండియా నుంచి నుంచి ముగ్గురు కొనసాగుతున్నారు. పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజామ్ (809) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (765), శుభ్‌మన్ గిల్ (763), విరాట్ కోహ్లీ (746) ఉన్నారు. ఇక..ఆసీస్ తో రెండో టెస్టుకు సైతం గిల్ అందుబాటులో ఉండటం లేదు. రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరటం ఖాయమైంది.












Click it and Unblock the Notifications