Sanju Samson: టాలెంట్‌ను తొక్కేస్తోన్న బీసీసీఐ: జూనియర్లతో జాతీయ జట్టు

ముంబై : ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియా.. భారత్‌లో తన పర్యటనను కొనసాగించనుంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. అయిదు మ్యాచ్‌లో సిరీస్ ఇది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడింది టీమిండియా. 2-1 తేడాతో ఆ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర్ 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి. విశాఖతో పాటు తిరువనంతపురం, గువాహటి, నాగ్‌పూర్, బెంగళూరుల్లో ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ జరుగుతాయి.

IND vs AUS 1st T20: Netizens react after Sanju Samson dropped

ఈ సిరీస్ కోసం మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. సూర్యకుమార్ యాదవ్‌.. కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. వైస్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. మొత్తం టీ20 స్పెషలిస్టులతో కూడిన టీమ్ ఇది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా.. ఇలా రెగ్యులర్ ప్లేయర్లను ఎవరినీ తీసుకోలేదు. వారికి విశ్రాంతి ఇచ్చింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్లేయర్లందరూ ఆస్ట్రేలియాపై అయిదు టీ20 మ్యాచ్‌లను ఆడే సువర్ణావకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఈ సిరీస్‌కు ఎంపికైన వారందరూ వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆడుతున్న ప్లేయర్లే.

ఈ టీమ్‌లో కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు సంజు. బీసీసీఐ సెలెక్టర్లు అతనికి అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. #JustceforSanjuSamson అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఇదివరకు జాతీయ జట్టు తరఫున ఆడాడు. చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. 13 వన్డేల్లో 12 ఇన్నింగులను ఆడిన శాంసన్.. 390 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 55.71. వ్యక్తిగత అత్యధిక పరుగులు 86. అయిదు సార్లు అజేయుడిగా నిలిచాడు.

టీ20 ఇంటర్నేషన్స్‌లోనూ అతనికి మంచి ట్రాక్ రికార్డే ఉంది. 24 మ్యాచ్‌లల్లో 21 ఇన్నింగులను ఆడిన సంజు శాంసన్ 374 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 77. బ్యాటింగ్ యావరేజ్ 19.68. స్ట్రైక్ రేట్‌.. 133.57. ఇంటర్నేషనల్స్ ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. అతణ్ని ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.

బీసీసీఐ ప్రకటించిన టీమిండియాలో- సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.

ఈ టీ20 సిరీస్‌లో భారత్‌తో తలపడే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే ప్రకటించింది. ఇందులో- మాథ్యూ వేడ్ (కేప్టెన్) జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాకు చోటు కల్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+