IND vs AUS final: 13 జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లపై లైవ్ టెలికాస్ట్: అడ్రసులు ఇవే
IND vs AUS final: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. తాడో పేడో తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి.
కేప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస అయ్యర్, రవీంద్ర జడేజాతో కూడిన భారత జట్టు దూకుడును ఆస్ట్రేలియా ఎలా అడ్డుకుంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో బౌలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ కోసం అటు ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిందా కంగారూల టీమ్. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది.
అటు ఫైనల్ మ్యాచ్.. ఇటు ఆదివారం సెలవు రోజు కావడంతో అహ్మదాబాద్‌కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు. వందే భారత్ సహా పశ్చిమ రైల్వే 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, ముంబైల నుంచి ఆయా రైళ్లన్నీ అహ్మదాబాద్ వైపు పరుగులు తీస్తోన్నాయి.

ఈ మ్యాచ్‌ను ఏపీలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో చేసిన ఈ ప్రయోగానికి అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో దాన్ని మరింత విస్తృతం చేసింది.
విశాఖపట్నం- ఆర్‌కే బీచ్, అనంతపురం- పీటీసీ గ్రౌండ్స్, ఏలూరు- ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్, గుంటూరు- ఎంజీ హైస్కూల్ గ్రౌండ్స్, కడప- ఆర్ట్స్ కాలేజీ, కాకినాడ- ఆర్ఎంసీ గ్రౌండ్స్, కర్నూలు- డీఎస్ఏ స్టేడియం, నెల్లూరు- వీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్, ఒంగోలు- జెడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళం- స్కూల్ గ్రౌండ్స్, తిరుపతి- కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్, విజయవాడ- మునిసిపల్ స్టేడియం, విజయనగరం- ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్‌లల్లో ఈ బిగ్ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications