IND vs AUS final: వందే భారత్‌కూ ఫీవర్ పట్టుకుంది: ఈ రూట్‌లో ప్రత్యేక రైళ్లు: రికార్డ్ ఆక్యుపెన్సీ..!!
ముంబై: క్రికెట్ ప్రపంచంలో బిగ్ డే. విశ్వ విజేత ఎవ్వరో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఓటమి అనేదే తెలియని భారత జట్టును ఈ తుదిపోరులో ఆస్ట్రేలియా ఢీ కొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ మ్యాచ్‌ను చూడటానికి పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంటోన్నారు క్రికెట్ ప్రేమికులు. వ్యక్తిగత వాహనాలు, విమానాలు, రైళ్ల ద్వారా అహ్మదాబాద్‌కు వస్తోన్నారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటళ్లు బుక్ అయ్యాయి. రోడ్లపై వాహనాల రద్దీ రోజువారీ కంటే భారీగా పెరిగింది.

ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో అహ్మదాబాద్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా నగరాల నుంచి ప్రత్యేక రైళ్లను అహ్మదాబాద్‌కు నడిపిస్తోన్నారు. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి మూడు స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చెన్నై, బెంగళూరు వంటి దక్షిణాది నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వచ్చే వారి కోసం ముంబై నుంచి రైలు సౌకర్యాన్ని కల్పించినట్లు సెంట్రల్, పశ్చిమ రైల్వే తెలిపాయి. మొత్తం 11 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించాయి. మ్యాచ్ ముగిసిన తరువాత అంటే-సోమవారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఢిల్లీ, ముంబైలకు తిరుగు ప్రయాణమౌతాయి.

ఈ జాబితాలో వందే భారత్ కూడా చేరింది. నంబర్ 09035 స్పెషల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్..ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాలకు ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. ఉదయం 10:40 నిమిషాలకు అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు 92 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
అభిమానులను మళ్లీ వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఏకంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనుంది పశ్చిమ రైల్వే. నంబర్ 09036 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7:25 నిమిషాలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంటుంది. వడోదర, సూరత్, బోరివలి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

దేశ రాజధాని నుంచీ అహ్మదాబాద్‌కు వరల్డ్ కప్ 2023 పేరుతో ప్రత్యేక రైలును నడుస్తోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ రైలు ఢిల్లీ నుంచి బయలుదేరింది. స్లీపర్ కోచ్- రూ. 620, థర్డ్ ఏసీ ఎకానమీ- రూ.1,525, 2ఏసీ- రూ.1,665, ఫస్ట్ ఏసీ- 3,490 రూపాయల ఛార్జీని నిర్ధారించారు.












Click it and Unblock the Notifications