టీమిండియా వరస్ట్ స్టార్ట్- ఫస్ట్ బాల్‌కే బిగ్ వికెట్
Yashasvi Jaiswal: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో ఆరంభమైన రెండో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ అధ్వాన్నంగా ఆరంభించింది. తొలి టెస్ట్‌లో గెలిచిన విజయాన్ని ఇక్కడా కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ- అది సాధ్యపడేలా కనిపించట్లేదు మ్యాచ్ బిగినింగ్ సీన్ చూస్తోంటే.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఆ నిర్ణయం తప్పని తొలి ఓవర్‌లోనే తేలిపోయింది. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడింది. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. మిఛెల్ స్టార్క్ వేసిన ఓవర్ అది. స్టార్క్ లెగ్ స్టంప్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరిని ఆడటంలో తికమక పడ్డాడు జైస్వాల్. దాన్ని ఆడలేకపోయాడు. నేరుగా ప్యాడ్స్‌ను తాకిందా బంతి.

ఆ వెంటనే ఎల్బీడబ్ల్యూ కోసం బిగ్ అప్పీల్ చేశారు ఆసీస్ ప్లేయర్లు.. మిఛెల్ స్టార్క్ సహా. ఆ వెంటనే అంపైర్ అవుట్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిపై రివ్యూ కోసం ప్రయత్నించాడు జైస్వాల్. నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడాడు. అవుటా? కాదా? అనే విషయాన్ని రాహుల్ ఖచ్చితంగా చెప్పలేకపోవడంతో పెవిలియన్ బాట పట్టాడు యశస్వి.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడిన విషయం తెలిసింది. సెంచరీ బాదాడు. 161 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం మూడు సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. అదే ఇన్నింగ్‌లో విరాట్ కోహ్లీ సైతం వంద పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
జైస్వాల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లోకి దిగాడు. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్ పునర్నిర్మించే పనిలో పడ్డాడు. రావడంతోనే గిల్ రెచ్చిపోయాడు నాలుగు ఫోర్లు బాదాడు. వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది టీమిండియా. రాహుల్ ఆచితూచి ఆడుతున్నాడు. 18 బంతుల వరకు ఆడినా ఖాతా తెరవలేదు.












Click it and Unblock the Notifications