రిటైర్ అయ్యానని అనుకుంటున్నారా: రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్

IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. రెండో రోజు లంచ్ సమయానికి సగం మంది ప్లేయర్లు అవుట్ అయ్యారు. పెవిలియన్ చేరుకున్నారు.

సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇది గెలిస్తేనే 2-2తో సమవుజ్జీగా నిలవగలుగుతుంది. అటు వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కూ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా అత్యంత కీలకంగా మారిందీ గేమ్ భారత్‌కు.

IND vs AUS I m not retiring says Rohit Sharma

ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. రెండో రోజు భోజన విరామ సమయానికి అయిదు వికెట్లను నేల కూల్చగలిగారు. కీలకమైన బ్యాటర్లందరూ వెనుదిరిగారు. ఫలితంగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోరును కూడా చేయలేకపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ ఆడట్లేదనే విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు రెండు వికెట్లను కూల్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజాతో పాటు డేంజరస్ మార్నుస్ లాబుషేన్‌ను అవుట్ చేశాడు.

భోజన విరామ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ గేమ్‌లో ఆడకపోవడం పట్ల స్పందించాడు. వివరణ ఇచ్చాడు. తాను రిటైర్ కాలేదని వెల్లడించాడు. ఈ ఒక్క గేమ్‌కు మాత్రమే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. జట్టుకు అవసరమైన విధంగా, ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతోండటం వల్లే ఆడదలచుకోలేదని అన్నాడు.

తాను రిటైర్మెంట్ కాదలచుకోలేదనీ తేల్చి చెప్పాడు రోహిత్. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నానంటే మళ్లీ ఏ అయిదు నెలల తరువాతో జట్టులోకి వస్తానని అనుకోవద్దనీ అన్నాడు. కష్టపడి మళ్లీ ఫామ్‌లోకి వస్తాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఫామ్‌లో లేకపోవడం వల్లే ఈ మ్యాచ్‌కు దూరం అయ్యానని పేర్కొన్నాడు.

బయట ఎక్కడో కూర్చుని ల్యాప్ టాప్ పట్టుకుని, పెన్- పేపర్ పెట్టుకుని తాను రిటైర్ అవుతున్నట్లు ఏదేదో రాస్తోన్నారంటూ చురకలు అంటించాడు. అవన్నీ అవాస్తవ కథనాలనీ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్ గురించి డిసైడ్ చేయడానికి వాళ్లెవరంటూ ఎద్దేవా చేశాడు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది తన మీదే ఆధారపడి ఉంటుందే తప్ప ఎవరో రాస్తోన్నట్లు కాదని చెప్పాడు.

రేపు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. నేను పరుగులు చేయవచ్చు, చేయలేకపోవచ్చు. అలాగనీ- రిటైర్ అవుతాననుకోవడం సరికాదు. మళ్లీ ఫామ్‌లోకి వస్తానని బలంగా నమ్ముతున్నా. స్పోర్ట్స్ అనేది నా జీవితంలో ఓ ముఖ్య భాగం. దాన్నుంచి అంత త్వరగా దూరం కాదలచుకోలేదు. భవిష్యత్ రోజూ మారుతుంటుంది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు.. అని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+