ఆసుపత్రికి బుమ్రా తరలింపు..!!

IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. రెండో రోజు టీ సమయానికి 181 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ నాలుగు పరుగుల ఆధిక్యతను సాధించింది.

సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇది గెలిస్తేనే 2-2తో సమవుజ్జీగా నిలవగలుగుతుంది. అటు వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కూ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా అత్యంత కీలకంగా మారిందీ గేమ్ భారత్‌కు.

IND vs AUS India have been hit an injury scare as Jasprit Bumrah leaving the SCG undergo scans

ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచారు. 181 పరుగులకే కుప్పకూల్చారు. కొత్త ప్లేయర్ బ్యు వెబ్‌స్టర్ ఒక్కడే బౌలర్లను ప్రతిఘటించగలిగాడు. తొలి టెస్ట్‌లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. నాలుగు మెరుపు ఫోర్లతో 57 పరుగులు చేశాడు.

సామ్ కొన్‌స్టాస్- 23, ఉస్మాన్ ఖవాజా- 2, మార్నుస్ లాబుషేన్- 2, స్టీవెన్ స్మిత్- 33, ట్రావిస్ హెడ్- 4, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ- 21, కేప్టెన్ పాట్ కమ్మిన్స్- 10, మిఛెల్ స్టార్క్- 1, నాథన్ లియాన్- 9 (నాటౌట్), స్కాట్ బోలాండ్- 9 పరుగులు చేశారు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడు, జస్‌ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెండేసి చొప్పున వికెట్లు కూల్చారు.

మ్యాచ్ సెకెండ్ సెషన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. గ్రౌండ్‌ను వీడాడు. అర్ధాంతరంగా మ్యాచ్‌ను వీడి వెళ్లాల్సొచ్చిందతనికి. దీనితో విరాట్ కోహ్లీ తాత్కాలిక కేప్టెన్‌గా పగ్గాలను అందుకున్నాడు. రెండో సెషన్‌లో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు బుమ్రా. అతని బౌలింగ్ వేగం సైతం భారీగా మందగించింది. ఆ ఓవర్‌లో సగటున 125 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బంతులను సంధించగలిగాడు.

బుమ్రా బౌలింగ్‌పై కామెంటేటర్ రవిశాస్త్రి అప్‌డేట్ ఇచ్చాడు. మడమ గాయంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. తొలుత అరగంట పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని భావించినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. నొప్పి తీవ్రం కావడంతో బుమ్రాను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని చెప్పాడు. అక్కడ స్కాన్ తీసిన తరువాతే గాయం తీవ్రత ఏమిటనేది తెలుస్తుందని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+