టీమిండియా బిగ్ షాక్: సిరీస్ డిసైడర్‌కు స్టార్ ప్లేయర్ దూరం

IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్- వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లల్లో 2-1తో వెనుకంజలో ఉంది. ప్రత్యేకించి- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ముగిసిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అవమానకర ఓటమిని చవి చూడాల్సొచ్చింది.

ఈ బీజీటీ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియగా.. నాలుగో దాంట్లో మళ్లీ పాత పాటే పాడింది. పరాజయాలకు అలవాటు పడ్డామనే విషయాన్ని బహిర్గతం చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వంటి కొమ్ములు తిరిగిన బ్యాటర్లు సైతం మట్టికరిచారీ గేమ్‌లో.

IND vs AUS Injury hit the India camp as pacer Akash Deep has been ruled out for the 5th Test

ఈ పరిస్థితుల మధ్య చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమౌతోంది భారత్. జనవరి 3వ తేదీన ఆరంభం కానుందీ గేమ్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇందులో గెలిస్తే గానీ సిరీస్ సమం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయకేతనం ఎగురవేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. మెల్‌బోర్న్ నుంచి ఇప్పటికే సిడ్నీకి చేరుకుంది జట్టు. నెట్ సెషన్స్‌లో పాల్గొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోంది. జట్టు ప్లేయర్లందరూ అందుబాటులో ఉన్నారు. కఠోరంగా శ్రమిస్తోన్నారు.

ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ దూరం అయ్యాడు. వెన్ను నొప్పితో అతను బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. బ్యాక్ ఇంజ్యూరీ వల్ల ఆకాష్ దీప్ అయిదో టెస్ట్ ఆడట్లదేని వెల్లడించాడు.

గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు ఆకాష్ దీప్. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 3.59 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. 10 ఇన్నింగ్‌లల్లో 49.40 స్ట్రైక్ రేట్‌తో 83 పరుగులు చేశాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు ఆకాష్ దీప్. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లల్లో అయిదు వికెట్లు నేలకూల్చాడు.

ఈ అయిదింట్లో గబ్బాలో మూడు, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన నాలుగోదైన బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు తోడుగా పర్‌ఫెక్ట్ బంతులను సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ వస్తోన్నాడు. సిరీస్ డిసైడర్ అయిన అయిదో టెస్ట్‌కు దూరం కావడం ఇబ్బందికరంగా మారినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+