అదరహో.. నితీష్ కుమార్ రెడ్డి: ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. మ్యాచ్‌పై పట్టు బిగించినప్పటికీ మూడో సెషన్‌లో పట్టు సడలింది. వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. మూడో రోజు 9 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది.
ఈ సెషన్‌లో హైలైట్‌గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇదే అతని మొట్టమొదటి సెంచరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొమ్మిది ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో వంద పరుగులను అందుకున్నాడు. 191 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఆదుకున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరించాడు.

అర్ధసెంచరీ చేశాడు సుందర్. సరిగ్గా 50 పరుగులు చేసిన తరువాత సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. డకౌట్ అయ్యాడు. దీనితో తొమ్మిది వికెట్లు పడ్డాయి. క్రీజ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, చిట్టచివరి బ్యాటర్ మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు. 99 పరుగుల వద్ద ఫోర్ కొట్టి మరీ తొలి సెంచరీని అందుకున్నాడు నితీష్.
తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 140 పరుగులు చేశాడు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. కేప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయిదే అయిదు బంతులను ఎదుర్కొని పెవిలియన్ దారి పట్టాడు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. 36 పరుగులకే అవుట్ అయ్యాడు. నైట్ వాచ్‌మెన్‌గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ డకౌట్ కావడం టీమిండియా ఇన్నింగ్‌ను దెబ్బకొట్టింది.
THE CELEBRATION FROM NKR'S FATHER IS SIMPLY AMAZING. 🥹❤️
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024
- Nitish Kumar Reddy, you've made whole India proud. 🇮🇳pic.twitter.com/Gx1PFY7RnE
అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ఆరంభించింది టీమిండియా. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. రిషభ్ పంత్- 28, రవీంద్ర జడేజా- 17 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. 221 పరుగులకు ఏడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడిన జట్టును నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు.
భారీ షాట్లు ఆడాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో బౌలర్ తల మీదుగా లాంగాన్‌లో కొట్టిన భారీ సిక్స్.. అతని ఇన్నింగ్‌లో హైలైట్. మిడిల్ స్టంప్ మీద పడి లేచిన బంతిని ఫ్రంట్ ఫుట్ ఆడాడు నితీష్. మెరుపువేగంతో ఫెన్సింగ్ దాటిందా బంతి. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications