స్టుపిడ్..స్టుపిడ్..స్టుపిడ్: టీమిండియా స్టార్‌పై గవాస్కర్ ఫైర్
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. నిప్పులు చెరుగుతున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచింది. మూడో రోజు టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అదే సమయంలో వర్షం రావడం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.
ఈ సెషన్‌లో హైలైట్‌గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇదే అతని మొట్టమొదటి అర్ధసెంచరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగు ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 61 పరుగుల మీద ఆడుతున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరిస్తోన్నాడు.

తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 140 పరుగులు చేశాడు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. కేప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయిదే అయిదు బంతులను ఎదుర్కొని పెవిలియన్ దారి పట్టాడు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. 36 పరుగులకే అవుట్ అయ్యాడు. నైట్ వాచ్‌మెన్‌గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ డకౌట్ కావడం టీమిండియా ఇన్నింగ్‌ను దెబ్బకొట్టింది.
అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ఆరంభించింది టీమిండియా. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. రిషభ్ పంత్- 28, రవీంద్ర జడేజా- 17 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. 221 పరుగులకు ఏడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడిన జట్టును నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు.

రిషభ్ పంత్ అవుట్ అయిన విధానంపై టీమిండియా లెజెండర్ సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగాడు. కామెంటరీ బాక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతను ఆడిన షాట్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసహనంతో ఊగిపోయాడు. స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్.. అంటూ అరిచినంత పని చేశాడు.
స్కాట్ బోలాండ్ వేసిన ఓవర్‌లో అవుట్ అయ్యాడు రిషభ్ పంత్. రౌండ్ ది వికెట్‌గా అతను సంధించిన ఫుల్ అవుట్ సైడ్ ఆఫ్ డెలివరీని ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు పంత్. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతిని అలవోకగా అందుకోగలిగాడు అక్కడే పొంచివున్న నాథన్ లియాన్. దీనితో 191 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత్.

ఈ షాట్ సునీల్ గవాస్కర్‌ను ఆగ్రహోదగ్రుడిని చేసింది. అతను తన సహజసిద్ధమైన గేమ్‌ను ఆడట్లేదంటూ మండిపడ్డాడు. దీన్నొక స్టుపిడ్ షాట్‌గా అభివర్ణించాడు. రిషభ్ పంత్ షాట్ ఆడిన చోట ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారని, ఆ మాత్రం కూడా ధ్యాస లేకుండా షాట్ ఆడాడని విమర్శించాడు.
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడానికి అనర్హుడని, మరో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలని చురకలు అంటించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఆడటం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికాడు. తన సహజ ధోరణికి విరుద్ధంగా ఆ షాట్ కొట్టాడని ధ్వజమెత్తాడు గవాస్కర్.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications