బెన్ స్టోక్స్.. టీమిండియాకు స్ట్రోక్: తుదిజట్టులో కొత్త ముఖానికి చోటు: నో అండర్సన్
Virat Kohli: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆరంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమౌతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టబోతోంది భారత్.
తొలి మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది హైదరాబాద్. ఈ నెల 25వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో రెండో టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. మూడో మ్యాచ్ ఈ నెల 15వ తేదీన రాజ్‌కోట్‌లో, నాలుగో మ్యాచ్ 23న రాంచీలో ముగుస్తాయి. మార్చి 7వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో అయిదో మ్యాచ్ జరుగుతుంది.

ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కేప్టెన్సీని వహిస్తోన్నాడు. దీని తరువాత ఐపీఎల్ 2024 సిరీస్ మొదలవుతుంది. మార్చి 23వ తేదీ నుంచి ఐపీఎల్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ జాతర ఆరంభమౌతుంది. స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడానికి భారత జట్టు రంగం సిద్ధం చేసుకుంది.
తొలి రెండు టెస్టుల కోసం విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో రజత్ పటిదార్ ఎంపికయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ టోర్నమెంట్లను ఆడుతున్నాడీ మధ్యప్రదేశ్ బ్యాటర్. గత ఏడాదే టీమిండియా తరఫున వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ అడుగుపెట్టాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రానికి రెడీ అయ్యాడు.
అటు- బలమైన భారత జట్టును ఎదుర్కొనడానికి ఇంగ్లాండ్ రెడీ అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంఫియన్‌షిప్‌లో ప్రస్తుతం ఏడోస్థానంలో కొనసాగుతోంది ఇంగ్లాండ్. ఇదే పాయింట్ల పట్టికలో సెకెండ్ పొజీషన్‌లో ఉన్న రోహిత్ సేనతో తలపడటానికి సమాయాత్తమైంది.

కొద్దిసేపటి కిందటే తుదిజట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. మెరికల్లాంటి ప్లేయర్లను ఎంపిక చేసింది. వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. కొత్త ముఖం టామ్ హార్ట్లేను తీసుకున్నారు. ఉప్పల్ స్టేడియం పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటం వల్లే అండర్సన్‌ను ఎంపిక చేయలేదు.
ఇంగ్లాండ్ తుదిజట్టులో- జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లె పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కేప్టెన్), బెన్ ఫోక్స్, రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్ ఆడనున్నారు.












Click it and Unblock the Notifications