టీమిండియాలో ఐపీఎల్ స్టార్: విరాట్ కోహ్లీకి రీప్లేస్

Virat Kohli: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆరంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమౌతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టబోతోంది భారత్.

తొలి మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది హైదరాబాద్‌. ఈ నెల 25వ తేదీన ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో రెండో టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. మూడో మ్యాచ్ ఈ నెల 15వ తేదీన రాజ్‌కోట్‌లో, నాలుగో మ్యాచ్ 23న రాంచీలో ముగుస్తాయి. మార్చి 7వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో అయిదో మ్యాచ్ జరుగుతుంది.

IND vs ENG 1st test: Rajat Patidar has replaced Virat Kohli

ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కేప్టెన్సీని వహిస్తోన్నాడు. దీని తరువాత ఐపీఎల్‌ 2024 సిరీస్‌ మొదలవుతుంది. మార్చి 23వ తేదీ నుంచి ఐపీఎల్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ జాతర ఆరంభమౌతుంది. స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడానికి భారత జట్టు రంగం సిద్ధం చేసుకుంది.

తొలి రెండు టెస్టుల కోసం విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదని ఇప్పటికే ప్రకటించాడు. హైదరాబాద్, విశాఖపట్నంలల్లో తొలి రెండు టెస్టుల నుంచి తన పేరును ఉపసంహరించుకుంటోన్నట్లు వెల్లడించాడు. తుది జట్టు కోసం తన పేరును పరిశీలించొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.

దీనికి గల కారణాలను వెల్లడించలేదు విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకొంటోన్నట్లు వివరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌కూ డుమ్మా కొట్టాడీ బ్యాటింగ్ మెషీన్. ఇప్పుడు మళ్లీ అదే దారి పట్టాడు. బలమైన ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు.

IND vs ENG 1st test: Rajat Patidar has replaced Virat Kohli

విరాట్ కోహ్లీ స్థానంలో రజత్ పటిదార్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ టోర్నమెంట్లను ఆడుతున్నాడీ మధ్యప్రదేశ్ బ్యాటర్. గత ఏడాదే టీమిండియా తరఫున వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ అడుగుపెట్టాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రానికి రెడీ అయ్యాడు.

భారత్ ఏ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన రజత్ పటిదార్.. ఇంగ్లాండ్ లయన్స్‌పై అదరగొట్టిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను బాదాడు. తొలి మ్యాచ్‌లో 111, రెండో మ్యాచ్‌లో 151 పరుగులు చేశాడు. ఫుల్ ఫామ్‌ను కొనసాగిస్తోన్న నేపథ్యంలో అతన్ని టెస్టుల్లోకి తీసుకుంది బీసీసీఐ.

నిజానికి విరాట్ కోహ్లీ స్థానాన్ని వెటరన్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రంజీ స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌తో భర్తీ చేయొచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి గానీ.. వాటన్నింటి కంటే భిన్నంగా రజత్ పటిదార్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. ఈ సాయంత్రానికి అతను హైదరాబాద్‌కు చేరుకుంటాడు. జట్టుతో కలుస్తాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+