Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ గడ్డపై డబుల్ సెంచరీ: జైస్వాల్ గట్స్‌కు సెల్యూట్: అరుదైన ఫీట్

Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్.. భారీ స్కోరు సాధించింది. వరుసగా ఈ మ్యాచ్‌లో కూడా తొలి ఇన్నింగ్ స్కోరును 400 పరుగుల వరకూ తీసుకెళ్లింది. 396 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులతో రెండో రోజు ఆటను మొదలుపెట్టింది. యశస్వి జైస్వాల్ 179, రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించారు. 364 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. 20 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్.. అండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

IND vs ENG 2nd test: Yashasvi Jaiswal becomes the 4th Indian to score 200 in WTC

నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. తన దూకుడును కొనసాగించాడు. డబుల్ సెంచరీ చేశాడు. 191 పరుగులు వద్ద ఉన్నప్పుడు షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా ఓ సిక్స్, ఓ ఫోర్ బాదాడు. ఫోర్‌తో డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఫోర్‌తో హాఫ్ సెంచరీ, సిక్సర్‌తో సెంచరీ, ఫోర్‌తో 150 పరుగుల ల్యాండ్ మార్క్‌ను అధిగమించిన జైస్వాల్.. ఫోర్‌తో డబుల్ సెంచరీ చేయడం అతని గట్స్‌కు అద్దం పట్టింది.

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. ఇదివరకు విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఈ డబుల్స్‌తో వారి సరసన చేరాడు యంగ్ క్రికెటర్. 22 సంవత్సరాల వయస్సులో టెస్టుల్లో డబుల్స్ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

209 వ్యక్తిగత పరుగుల వద్ద అతని మారథాన్ బ్యాటింగ్‌కు తెరపడింది. అండర్సన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టబోయి..టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని జానీ బెయిర్‌స్టో అందుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 383 పరుగులు.

అతను అవుట్ అయిన తరువాత టీమిండియా ఇన్నింగ్ ఎంతో సేపు కొనసాగలేదు. 13 పరుగుల తేడాతో చివరి రెండు వికెట్లను కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా-6, ముఖేష్ కుమార్ డకౌట్ అయ్యారు. ఈ రెండు వికెట్లనూ రేహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ పడగొట్టారు. 396 పరుగుల వద్ద జట్టు ఆలౌట్ అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+