ఐపీఎల్ స్టార్‌కు పిలుపు: బీసీసీఐ బిగ్ ఆఫర్

KL Rahul: ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో జయకేతనాన్ని ఎగురవేసిన భారత్.. ఇక మూడో గేమ్‌పై దృష్టి సారించింది. ఈ నెల 15వ తేదీన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందులోనూ విజయం సాధించడం ద్వారా అయిదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-2 తేడాతో ముందడుగు వేయాలనే పట్టుదలతో ఉంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా షెడ్యూల్ అయిన ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన రాజ్‌కోట్‌లో ఆరంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి రాంచీలో నాలుగో టెస్ట్, మార్చి 7వ తేదీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో చివరి టెస్ట్ షెడ్యూల్ అయింది. ఇందులో ఆధిక్యతను సాధించి, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

 IND vs ENG 3rd test: Devdutt Padikkal replace KL Rahul

ఈ పరిస్థితుల్లో టీమిండియాకు స్టార్ ప్లేయర్లందరూ దూరం అయ్యారు. బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్ల, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇలా వీరెవరూ జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. టెస్ట్‌లకు దూరం అయ్యారు.

వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ సిరీస్ ఆడట్లేదనే విషయం తెలిసిందే. ఇదివరకు తొలి రెండు టెస్టుల్లో ఆడబోనంటూ ప్రకటించాడు కోహ్లీ. అనంతరం దాన్ని మరో రెండు టెస్ట్‌లకూ ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ.. అదీ సాధ్యపడలేదు. సిరీస్‌ మొత్తం ఆడట్లేదు.

గాయాల పాలైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ కెేఎల్ రాహుల్‌ కూడా గైర్హాజర్ అయ్యారు. వారిద్దరి పేర్లనూ టెస్ట్ జట్టులోకి చేర్చింది గానీ.. ఆడతారా? లేదా? అనేది ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుందంటూ బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడదే వాస్తవరూపం దాల్చింది.

కేఎల్ రాహుల్.. మూడో టెస్ట్ నుంచీ తప్పుకొన్నాడు. దీనితో అతని స్థానంలో మరో యంగ్ ప్లేయర్‌ను జట్లులోకి తీసుకుంది. ఐపీఎల్ స్టార్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్‌‌ను రీప్లేస్ చేసింది. అతనికి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. రంజీల్లో అతని పెర్‌ఫార్మెన్స్, ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని పడిక్కల్‌కు టెస్ట్ మ్యాచ్‌లను ఆడే అవకాశం కల్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+