టెస్ట్ మ్యాచ్ అర్ధాంతరంగా తప్పుకొన్న రవి అశ్విన్: సబ్‌స్టిట్యూట్‌గా ఐపీఎల్ స్టార్

Ravi Ashwin: రాజ్‌కోట్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో ఇంగ్లాండ్ తడబడుతోంది. రెండు వికెట్ల నష్టానికి 211 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరంభించిన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయి.. కష్టాల్లో పడింది.

18 పరుగులు చేసిన జో రూట్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జానీ బెయిర్‌ స్టో డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో సెంచరీ హీరో బెన్ డకెట్, కేప్టెన్ బెన్ స్టోక్స్ ఆడుతున్నారు. రెండో రోజు ఆటలో మెరుపువేగంతో సెంచరీ బాదిన బెన్ డకెట్ 150ని పూర్తి చేసుకున్నాడు.

IND vs ENG 3td test: Devdutt Padikkal is the substitute fielder for Ravichandran Ashwin

కాగా- టెస్ట్ మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడం దీనికి కారణం. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆమె ప్రస్తుతం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల అశ్విన్.. హుటాహుటిన వెనుదిరగాల్సి వచ్చింది.

రవి అశ్విన్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. తుది జట్టులో చోటు కల్పించింది. గాయం కారణంగా మూడో టెస్ట్ నుంచి తప్పుకొన్న బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంలో ఇప్పటికే బీసీసీఐ అతన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

మూడో టెస్ట్ మ్యాచ్ ఆడే తుదిజట్టులో మాత్రం పడిక్కల్‌‌కు చోటు కల్పించలేదు. దీనితో అతను బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా మ్యాచ్‌ నుంచి వైదొలగాల్సి వచ్చిన నేపథ్యంలో- అతన్ని సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్. పడిక్కల్‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+