గుబులు రేపుతున్న విరాట్ కోహ్లీ నిర్ణయం
Virat Kohli: ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో జయకేతనాన్ని ఎగురవేసిన భారత్.. ఇక మూడో గేమ్‌పై దృష్టి సారించింది. ఈ నెల 15వ తేదీన గుజరాత్‌లోని రాజ్‌కోట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందులోనూ విజయం సాధించడం ద్వారా అయిదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-2 తేడాతో ముందడుగు వేయాలనే పట్టుదలతో ఉంది.
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో 396 పరుగులు చేసిన టీమిండియా..రెండో ఇన్నింగ్‌లో తడబడినప్పటికీ.. ప్రత్యర్థికి 398 పరుగుల భారీ లక్ష్యాన్నే నిర్దేశించగలిగింది. తొలి ఇన్నింగ్‌లో ఇంగ్లాండ్‌ను 253 పరుగులకే కట్టడి చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్‌లో మరింత చెలరేగారు. 292 పరుగులకు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్నీ కుప్పకూల్చారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా షెడ్యూల్ అయిన ఈ సిరీస్‌లో ఈ రెండూ కాకుండా మరో మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీ నుంచి రాంచీలో నాలుగో టెస్ట్, మార్చి 7వ తేదీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో చివరి టెస్ట్ షెడ్యూల్ అయింది. ఇందులో ఆధిక్యతను సాధించి, టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ. 3, 4 మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఈ రెండింట్లోనూ అందుబాటులో ఉండట్లేదు. రాజ్‌కోట్, రాంచీల్లో జరిగే టెస్టులకు ఎంపిక చేసే తుదిజట్టులో తన పేరును పరిశీలనలోకి తీసుకోవద్దంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విరాట్ కోహ్లీ హైదరాబాద్, విశాఖపట్నంలల్లో జరిగిన టెస్టుల్లో ఆడని విషయం తెలిసిందే. రాజ్‌కోట్ టెస్ట్‌కు అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేశాడు కోహ్లీ. 3, 4 టెస్టులకూ దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. ధర్మశాలలో జరిగే చివరి టెస్ట్ నాటికి జట్టుతో ఉంటాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications