IND vs NZ: గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌పై న్యూజిలాండ్ బిగ్ విక్టరీ!

IND vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు నాలుగో టీ20లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టును ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ స్టేడియంలో జరిగిన పోరులో కివీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బతీసింది. గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడి శతకంతో చెలరేగడంతో 260 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత ఇండియాను 172/9 పరుగులకే పరిమితం చేసి 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇషాన్ వస్తే వైభవ్ ఎగ్జిట్? టీమిండియాలో ఇదేం లెక్క సామీ!
ఇషాన్ వస్తే వైభవ్ ఎగ్జిట్? టీమిండియాలో ఇదేం లెక్క సామీ!

విరుచుకుపడిన గ్లెన్ ఫిలిప్స్.. భారత్ ముందు కొండంత లక్ష్యం
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే మయాంక్ యాదవ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్(3), డరిల్ మిచెల్(24) త్వరగానే పెవిలియన్‌కు పంపినప్పటికీ.. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్లెన్ ఫిలిప్స్ కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా మైకేల్ బ్రేస్‌వెల్(25 బంతుల్లో 65) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు.

IND vs NZ 4th T20 Glenn Phillips Century Powers New Zealand to 87-Run Win India Lead 3-1 in T20 Series

కుప్పకూలిన టీమిండియా టాపార్డర్
260 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. మొదటి ఓవర్లోనే జేకబ్ డఫీ.. సంజూ శాంసన్(4), ఇషాన్ కిషన్(0)లను ఔట్ చేసి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ(27), శ్రేయస్ అయ్యర్(22) కొద్ది సేపు నిలకడగా ఆడినా ఎక్కువసేపు నిలవలేకపోయారు. నితీష్ కుమార్ రెడ్డి(21), అక్షర్ పటేల్(7), నమన్ ధీర్(28) స్వల్ప వ్యవధిలోనే ఔట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి.

వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?
వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?

చివరలో తిలక్ వర్మ(35) నామమాత్రపు పోరాటం చేసినా విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో జేకబ్ డఫీ 4 వికెట్లతో భారత్ వెన్ను విరిచాడు. ఈ పరాజయంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలకు గండపడగా.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 3-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ లోని చివరి మ్యాచ్ ఆదివారం హామిల్టన్ వేదికగా జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+