వరుస పరాజయాల వేళ.. టీమిండియాలో కీలక మార్పులు- ఐపీఎల్ స్టార్‌కు చోటు
IND vs NZ: భారత్‌పై టెస్ట్ సిరీస్‌ను గెలిచిన ఉత్సాహంలో ఉంది న్యూజిలాండ్. బెంగళూరు, పుణేల్లో జరిగిన రెండు టెస్టుల్లో విజయఢంకా మోగించింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో టెస్ట్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన రెండింట్లోనూ న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో, రెండో గేమ్‌లో 107 పరుగులతో భారత్‌ను మట్టికరిపించింది. అదే ఊపులో మూడో టెస్ట్ కోసం సన్నాహకాల్లో నిమగ్నమైంది.

ముంబైలోని వాంఖడే స్టేడియం దీనికి వేదిక. నవంబర్ 24వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. వరుస పరాజయాల బారిన పడిన టీమిండియాను ఇక్కడ కూడా ఓటమి రుచి చూపించాలనే పట్టుదలతో ఉన్నారు బ్లాక్ క్యాప్స్. ఈ టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో గెలుచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. క్లీన్ స్వీప్‌ను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా గెలవడమో లేక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమో జరిగి తీరాలల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పైగా కేప్టెన్ రోహిత్ శర్మ బాగా అచ్చొచ్చిన హోమ్ పిచ్‌పై మూడో టెస్ట్‌ను ఆడనుంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలక మార్పులు చేర్పులు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. జట్టులోకి స్టార్ పేస్ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకుంది. హుటాహుటిన అతన్ని ముంబైకి పిలిపించుకుంది. జట్టుతో చేరాల్సిందిగా సూచించింది. తుదిజట్టులోకి హర్షిత్ రాణాను తీసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రా లేదా మహ్మద్ సిరాజ్‌లల్లో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం హర్షిత్ రాణాను ఇదివరకే ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రంజీ మ్యాచ్‌లను ఆడాలనే ఉద్దేశంతో అతన్ని రిలీజ్ చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు హర్షిత్ రాణా.
అస్సాంపై అయిదు వికెట్లు తీసుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. హాఫ్ సెంచరీ చేశాడు. దీనితో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడీ బౌలర్. టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 19 వికెట్లను పడగొట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications