ఫైనల్ కోసం టీమిండియా బిగ్ ఛేంజ్- లక్కు మార్చే లెక్కతో బరిలోకి..!!
T20 World Cup Final India vs New Zealand: ఇప్పుడు అందరి చూపు అహ్మదాబాద్ వైపే. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా - కివీస్ మధ్య బిగ్ ఫైనల్ జరగనుంది. ఇందు కోసం రెండు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి. టీమిండియా పైన ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. టీం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో అహ్మదాబాద్ చేదు చేదు జ్ఞాపకాలు ను వదలి.. కొత్త రికార్డు కోసం టీం బీసీసీఐ కీలక మార్పు చేసింది. దీంతో.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ మ్యాచ్ లో మరో లెక్క అన్నట్లుగా అంచనాలు పెరుగుతున్నాయి.
క్రికెట్ ప్రపంచం మొత్తం చూపు అహ్మదాబాద్ వైపే. టీ20 ప్రపంచకప్-2026 క్లైమాక్స్ వచ్చేసింది. రేపు (ఆదివారం) అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరం క్రికెట్ మేనియాతో ఊగిపోతోంది. ఫైనల్ మ్యాచ్ వేళ అహ్మదాబాద్ లో గతం లో వచ్చిన ఫలితాలు టీం ఇండియాను వెంటాడుతున్నాయి. సెంటిమెంటె తెర పైకి వస్తోంది. ఈ క్రమంలో కివీస్ ఇప్పటికే మైండ్ గేమ్ మొదలు పెట్టింది. టీమిండియా తుది జట్ట ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. గతం మరిచి.. గెలుపు కోసం ఒత్తిడిని దూరం చేసి సమిష్టిగా ఆడితే భారత్ ఛాంపియన్ అవ్వటం ఖాయమని సీనియర్లు సలహా ఇస్తున్నారు. ఇదే సమయంలో బీసీసీఐ ఈ గతం భయం టీం నుంచి దూరం చేయటానికి సంచలన నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ తాజా నిర్ణయం.. కొత్త జోష్
ఫైనల్ ఆడేందుకు టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. 2023 లో ఇదే గ్రౌండ్ లో భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓడింది. ఆ సమయంలో టీం ఇండియా ఐటీసీ నర్మద హోటల్‌లో బస చేసింది. ఇప్పుడు మాత్రం బీసీసీఐ టీం ఇండియాకు బస మార్చింది. సాధారణంగా ప్రతీ సారి ఉండే నర్మద హోటల్ కాదని.. ఈ సారి తాజ్ స్కైలైన్ హోటల్ లో బస ఏర్పాటు చేసారు. అదే విధంగా ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో సూపర్ -8 తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో ఆడేందుకు వచ్చిన టీం ఇండియా ఇదే ఐటీసీ నర్మద హోటల్‌లో బస చేసింది. కానీ ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. దీంతో.. సెంటిమెంట్ పరంగా బీసీసీఐ ఆలోచన మార్చుకుంది. టీం లోని ప్రతీ ఒక్కరిలో గతం ఆలోచనలను తీసేయటానికి ఎక్కడా నాటి ఆనవాళ్లు లేకుండా చర్యలు తీసుకుంటోంది.
అందులో భాగంగానే అహ్మదాబాద్ స్టేడియంలో కూడా హోమ్ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ వాడుకోవాలని టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది. అదే విధంగా పిచ్ సైతం మార్పు జరుగుతోంది. దీంతో.. అదృష్టం లేదని చెప్పే అహ్మదాబాద్ లో తమ అదృష్టాన్ని మార్చే లెక్కలతో బరిలోకి దిగుతోంది. మ్యాచ్ కోసం రైల్వే, విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు కోసం కోట్లాది ఫ్యాన్స్ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications