కేన్ మామ మళ్లీ అవుట్
IND vs NZ: భారత్‌పై టెస్ట్ సిరీస్‌ను గెలిచిన ఉత్సాహంలో ఉంది న్యూజిలాండ్. బెంగళూరు, పుణేల్లో జరిగిన రెండు టెస్టుల్లో విజయఢంకా మోగించింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో టెస్ట్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన రెండింట్లోనూ న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో, రెండో గేమ్‌లో 107 పరుగులతో భారత్‌ను మట్టికరిపించింది. అదే ఊపులో మూడో టెస్ట్ కోసం సన్నాహకాల్లో నిమగ్నమైంది.

ముంబైలోని వాంఖడే స్టేడియం దీనికి వేదిక. నవంబర్ 24వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. వరుస పరాజయాల బారిన పడిన టీమిండియాను ఇక్కడ కూడా ఓటమి రుచి చూపించాలనే పట్టుదలతో ఉన్నారు బ్లాక్ క్యాప్స్. ఈ టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో గెలుచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఈ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్, మాజీ కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం అయ్యాడు. తొడ కండరాల్లో గాయం కారణంగా తొలి రెండు టెస్ట్‌లను ఆడలేదు కేన్ విలియమ్సన్. మూడో టెస్ట్ నాటికి అందుబాటులోకి వస్తాడని భావించినప్పటికీ.. అదీ సాధ్యపడలేదు.
కండరాల గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మూడో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని వెల్లడించింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ సమయంలో తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు కేన్ విలియమ్సన్. రిహాబిలిటేషన్‌లో ఉంటోన్నాడు. ఆ కారణంగానే తొలి టెస్ట్‌కు దూరం అయ్యాడు.
ఇప్పటికీ అతను ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల మూడో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. కేన్ గాయంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని, గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడినప్పటికీ వందశాతం ఫిట్‌నెస్‌తో లేడని అన్నారు. న్యూజిలాండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నాటికి కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications