చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్- ద్రావిడ్, గంగూలీ, సచిన్ తరువాత అతనే..!!

Sarfaraz Khan: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్‌లో భారత్ చెలరేగుతోంది. తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపుతోంది. తొలి ఇన్నింగ్‌లో ఘోరంగా చేతులెత్తేసిన బ్యాటర్లు రెండో ఇన్నింగ్‌లో చుక్కలు చూపిస్తోన్నారు. 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ బౌలర్ల దుమ్ము దులుపుతోంది.

రెండో ఇన్నింగ్ మూడో రోజు ఆటలో భారత జట్టు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్.. ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. సెంచరీ అందుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లల్లో ఇదే అతన తొలి సెంచరీ. బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్ 4లో దిగిన అతను సెంచరీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

IND vs NZ Maiden test Century for Sarfaraz Khan at Bengaluru against New Zealand

నంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ బాదిన ఏడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదివరకు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు వారి జాబితాలో చేరాడీ యంగ్ అండ్ డాషింగ్ బ్యాటర్. ప్రస్తుతం 106 పరుగుల మీద ఆడుతున్నాడు.

మరో ఎండ్‌లో రిషభ్ పంత్ అతనికి పూర్తి సహకారాన్ని అందిస్తోన్నాడు. 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు పంత్. ఈ సెంచరీతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది టీమిండియా. మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌పై ఇంకా 69 పరుగులు వెనుకబడే ఉంది.

రెండో రోజు భారత్ నిలకడగా ఆడిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్- 35, కేప్టెన్ రోహిత్ శర్మ- 52, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేశారు. ఇన్నింగ్ చిట్టచివరి బంతికి విరాట్ కోహ్లీ అవుట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఆ ఒక్క బంతికి సమర్థవంతంగా ఎదుర్కొని వుంటే నేడు అతను కూడా సెంచరీ మార్క్ అందుకుని ఉండేవాడే.

న్యూజిలాండ్ బౌలర్లల్లో ఎజాజ్ పటేల్- 2, గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్‌లో నిప్పులు చెరిగిన మాట్ హెన్రీ, టిమ్ సౌథీ.. ఈ ఇన్నింగ్‌లో ఏ మాత్రం కూడా ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. పిచ్‌ మందకొడిగా మారడం, బ్యాటింగ్‌కు అనుకూలంగా తయారు కావడం వల్ల బౌలర్లకు వికెట్లు పడగొట్టడం కష్టతరమౌతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+