అదృష్టం పిచ్లా పట్టుకుంది: పుష్కర కాలం తరువాత తొలి సెంచరీ- రచిన్ నయా రికార్డ్

Rachin Ravindra: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై భారీ ఆధిక్యతను సాధించింది న్యూజిలాండ్. తొలి ఇన్నింగ్‌లో 248 పరుగుల ఆధిక్యతతో ఆడుతోంది. ఇంకా మూడు వికెట్లు చేతిలో మిగిలే ఉండటం వల్ల ఈ ఆధిక్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌లో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. మూడో రోజు తొలి గంటలో వెంటవెంటనే మరో నాలుగు వికెట్లను పడగొట్టారు. ఊపిరి ఆడనివ్వని విధంగా బంతులను సంధించారు. ఈ క్రమంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు కూల్చాడు. మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

IND vs NZ Rachin Ravindra becomes 1st New Zealand batter to score hundred after 12 Years

భారత బౌలర్ల ధాటికి డారిల్ మిఛెల్- 18, టామ్ బ్లండెల్- 5, గ్లెన్ ఫిలిప్స్- 14, మాట్ హెన్రీ- 8 వెంటవెంటనే అవుట్ అయ్యారు. జట్టు స్కోరు 193 పరుగుల వద్ద మిఛెల్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. వికెట్లకు కాస్త దూరంగా మహ్మద్ సిరాజ్ సంధించిన డెలివరీని ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు మిఛెల్. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గల్లీ వైపు దూసుకెళ్లిన బంతిని యశస్వి జైస్వాల్ అందుకున్నాడు.

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 204 పరుగుల వద్ద టామ్ బ్లండెల్ అవుట అయ్యాడు. అనంతరం రవీంద్ర జడేజా రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీలను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో 233 పరుగుల వద్ద ఏడు వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్.

ఎంతో సేపు ఆ జట్టు ఇన్నింగ్ ఉండబోదని భావించినప్పటికీ రచిన్ రవీంద్ర ఆదుకున్నాడు. సెంచరీతో చెలరేగుతున్నాడు. సెంచరీ వైపు దూసుకెళ్తోన్నాడు. మరో ఎండ్‌లో టిమ్ సౌథీ అతనికి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి రచిన్ రవీంద్ర 104, టిమ్ సౌథీ 49 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మొత్తం ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది కివీస్.

మొత్తంగా 299 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది. రచిన్ ఇన్నింగ్‌లో మొత్తం రెండు భారీ సిక్సర్లు, 11 మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో కొత్త చరిత్రను సృష్టించాడు రచిన్ రవీంద్ర. 12 సంవత్సరాల తరువాత టీమిండియాపై తొలి సెంచరీ చేసిన మొట్టమొదటి న్యూజిలాండ్ బ్యాటర్ అతనే కావడం విశేషం.

అంతకుముందు- 2012లో భారత్‌పై టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు రాస్ టేలర్. ఆ తరువాత మళ్లీ సెంచరీ చేసిన బ్యాటర్ రచిన్ ఒక్కడే. అతని బాగా కలిసొచ్చిన పిచ్ ఇది. గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్‌లో కూడా ఇదే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై భారత్‌పై అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఇప్పుడు మళ్లీ సెంచరీ బాదాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+