స్పీడున్నోడు- ధోని రికార్డు బద్దలు
Rishabh Pant: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్‌లో భారత్ చెలరేగుతోంది. తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపుతోంది. తొలి ఇన్నింగ్‌లో ఘోరంగా చేతులెత్తేసిన బ్యాటర్లు రెండో ఇన్నింగ్‌లో చుక్కలు చూపిస్తోన్నారు. 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ బౌలర్ల దుమ్ము దులుపుతోంది.
బ్రేకుల్లేని బ్యాటింగ్..
రెండో ఇన్నింగ్ మూడో రోజు ఆటలో భారత జట్టు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్.. ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. సెంచరీ అందుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లల్లో ఇదే అతన తొలి సెంచరీ. బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్ 4లో దిగిన అతను సెంచరీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భోజన విరామ సమయానికి 125 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

రిషభ్ పంత్ సునామీ ఇన్నింగ్..
మరో ఎండ్‌లో రిషభ్ పంత్ అతనికి పూర్తి సహకారాన్ని అందిస్తోన్నాడు. మెరుపు వేగంతో పరుగులు సాధిస్తోన్నాడు. బుల్లెట్ల వంటి షాట్లతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తిస్తోన్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో పోటీ పడుతూ పరుగులు కొల్లగొడుతున్నాడు. వారిద్దరి బ్యాటింగ్ దెబ్బకు భారీ స్కోర్ దిశగా సాగుతోంది టీమిండియా.
భారీ స్కోర్..
భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌పై 12 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. లంచ్ బ్రేక్ కంటే ముందే వర్షం పడటం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఫలితంగా సుమారు భోజన విరామానికి 40 నిమిషాలు ముందే మ్యాచ్‌కు విరామం ప్రకటించాల్సి వచ్చింది.
టీ20 ఫార్మట్‌లో..
రిషభ్ పంత్ టీ20 ఫార్మట్‌లో ఆడుతున్నాడు. 56 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, అయిదు మెరుపు ఫోర్లతో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో వేగంగా 2,500 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్ బ్యాటర్ అతనే.
ధోనీ రికార్డ్ బద్దలు..
62 ఇన్నింగ్‌లల్లో రిషభ్ పంత్ 2,500 పరుగులు చేశాడు. ఇదివరకు ఈ రికార్డు మాజీ కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద ఉండేది. 2,500 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి ధోనీ 69 ఇన్నింగ్స్ ఆడాడు. అతని కంటే ముందు ఫరూక్ ఇంజినీర్ 82 ఇన్నింగ్‌లల్లో ఇన్నేసి పరుగులు చేశాడు.
నిలకడగా..
తొలి 500 పరుగులు చేయడానికి రిషభ్ పంత్ 13 ఇన్నింగ్స్ ఆడాడు. 27 ఇన్నింగ్‌లల్లో 1,000, 42 ఇన్నింగ్‌లల్లో 1,500, 52 ఇన్నింగ్‌లల్లో 2,000, 62 ఇన్నింగ్‌లల్లో 2,500 పరుగులు బాదాడు. టెస్ట్ క్రికెట్‌లో అతను ఎంత నిలకడగా రాణిస్తోన్నాడనేది ఈ అంకెలు రుజువు చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications