IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!
IND vs PAK: ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టు పాకిస్తాన్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు పాకిస్తాన్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంస్య పతకం శ్రీలంకకు దక్కింది.
టీమ్ ఇండియా ఇన్నింగ్స్.. అభిషేక్ శర్మ విధ్వంసం
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మల విధ్వంసకరమైన అర్ధశతకాల పుణ్యమా అని పాకిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్, తిలక్ ఇద్దరూ పాకిస్థాన్ బౌలర్లను చితకబాదారు. ప్రారంభంలో భారత జట్టుకు శుభారంభం లభించలేదు. వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్‌ల రూపంలో జట్టు 51 పరుగులకే తొలి రెండు వికెట్లను కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటవ్వగా, సంజు శాంసన్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వచ్చిన అభిషేక్ శర్మ క్రీజ్‌లో నిలదొక్కుకుని రన్ రేట్‌ను కాపాడాడు. అభిషేక్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 93 పరుగులకు చేర్చాడు. 7 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 28 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

చివరి ఓవర్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ
శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 21 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 133 పరుగుల వద్ద 14.1 ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ ఐదో వికెట్ కు ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, శివమ్ దుబే ఆరో వికెట్ కు 30 బంతుల్లో 62 పరుగులు జోడించి, జట్టు స్కోరును 193కి చేర్చారు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 15 బంతుల్లో 27 పరుగులు చేసిన శివమ్ దుబే ఔటయ్యాడు. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 22 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన తిలక్ వర్మ.. 21 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అక్షర్ ఓ బంతికి ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున అహ్మద్ ద్యానియల్, అరాఫత్ మిన్హాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.
మెరుపు వేగంతో 96 పరుగులు చేసిన నివ్వెపపరిచిన హసన్ నవాజ్
భారత్ నిర్దేశించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్‌కు ఘోరమైన ఆరంభం లభించింది. వారి టాపార్డర్ పేకముక్కల్లా కూలిపోయింది. కేవలం 39 పరుగులకే తొలి మూడు వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ తీవ్ర కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన హసన్ నవాజ్ ఒంటరిగా భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. హసన్ నవాజ్ మినహా మరే ఇతర పాకిస్థాన్ బ్యాటర్ కూడా 30 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. అయినప్పటికీ నవాజ్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 188.24 విధ్వంసకర స్ట్రైక్ రేట్‌తో 96 పరుగులు బాదాడు. గెలవడానికి అసాధ్యమైన 33 పరుగులు అవసరమైన చివరి ఓవర్ వరకు అతను పాకిస్థాన్‌ను మ్యాచ్‌లో నిలబెట్టగలిగాడు.













Click it and Unblock the Notifications
