Viral Video: వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసి పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్!
Viral Video: 2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు(అక్టోబర్ 3) నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ఫైనల్ పోరు జరుగుతోంది. ఈ బిగ్ మ్యాచ్ లో భారత ఓపెనర్, 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 2 భారీ సిక్సర్లతో 15 పరుగులు మాత్రమే చేసి పాకిస్తాన్ ఆఫ్-స్పిన్నర్ సైమ్ అయూబ్ బౌలింగ్‌లో దురదృష్టవశాత్తూ ఔటయ్యాడు.
షాట్ సెలక్షన్ మిస్.. డ్రామా క్యాచ్!
ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ.. రెండో ఓవర్లోనే పాక్ బౌలర్ సౌద్ మసూద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి తన విధ్వంసకర ఉద్దేశాలను స్పష్టం చేశాడు. అయితే సైమ్ అయూబ్ వేసిన ఓవర్లో ప్రమాదకరమైన రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ వద్దకు వెళ్లింది. మొదట పట్టుతప్పినప్పటికీ.. ఉస్మాన్ ఖాన్ కొన్ని ప్రయత్నాల తర్వాత బంతిని సురక్షితంగా చేతుల్లోకి తీసుకుని పాకిస్తాన్ కు భారీ ఊరట అందించాడు.

సైమ్ అయూబ్ 'బేబీ' సెలబ్రేషన్ వైరల్
వైభవ్ సూర్యవంశీ వికెట్ పడగొట్టిన తర్వాత సైమ్ అయూబ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరిస్తున్న వైభవ్ సూర్యవంశీని క్రికెట్ వర్గాల్లో 'బేబీ బాస్' అని పిలుస్తుంటారు. దీనిని మనసులో ఉంచుకునే సైమ్ అయూబ్ పసికందును ఊయల ఊపుతున్నట్లు నటిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. తన సహచర ఆటగాళ్లతో కలిసి స్టేడియం సెలబ్రేషన్స్ చేస్తూ.. వైభవ్ సూర్యవంశీ చిన్న వయస్సును సూచిస్తూ ఈ రకమైన హావభావాలు వ్యక్తం చేయడం వైరల్‌గా మారింది.
వైభవ్ ఔట్‌పై అభిషేక్ శర్మ అసంతృప్తి
మరోవైపు నాన్-స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న అభిషేక్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ ఔటైన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఎంచుకున్న షాట్ సెలక్షన్ సరిగ్గా లేదని భావిస్తూ.. అభిషేక్ శర్మ డగౌట్ వైపు తిరిగి సైగలు చేయడం కెమెరాల్లో రికార్డయింది. ఇటీవల కాలం వైభవ్ సూర్యవంశీ నిలకడగా రాణిస్తుండటంతో అతని వికెట్ పడిపోవడం అభిమానులకు నిరాశను మిగిల్చింది.
HMM...THAT’S SOME CELEBRATION! 🤨 🍼
— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026
Saim Ayub knows how BIG BOSS BABY's wicket was 🙆
Watch Pakistan vs India in the Men's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/eUGsSMrIOo













Click it and Unblock the Notifications
