Ind vs Pak:భారత్ - పాక్ మ్యాచ్ పై నీలి నీడలు, అదే జరిగితే..!?
T20 World cup Ind vs Pak: టీ20 ప్రపంచ కప్ లో బిగ్ ఫైట్ కు సర్వం సిద్దమైంది. కొలొంబో వేదికగా దాయాదుల సిసలైన పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. రెండు జట్లకు ఈ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తుది జట్టు ఖరారు పైన టీమిండియా కసరత్తు చేస్తోంది. కాగా.. అనేక తర్జన భర్జనల తరువాత ఖరారైన ఈ మ్యాచ్ కొనసాగటం పైన కొత్త సందేహాలు మొదలయ్యాయి. మ్యాచ్ జరగక పోతే ఫలితం ఎలా డిసైడ్ చేస్తారనేది కీలకంగా మారుతోంది.
టీ20 ప్రపంచ కప్ లో భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభం కాకముందే ఉత్కంఠ పెంచుతోంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ప్రాక్టీసు చేస్తున్నాయి. దాయాదుల పోరు పైన క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ కొనసాగటం పైన కొత్త సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. వర్షం ఈ మ్యాచ్ కు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా సమాచారం. ఆదివారం మ్యాచ్ జరిగే రోజున కొలొంబోలో 60 శాతం వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ ప్రకటించింది. అదే జరిగితే ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. భారత్ టీం కొలొంబోలో పాకిస్థాన్ పైన పోరుకు సిద్దం అవుతోంది. పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్‌లను కొలంబోలోనే ఆడుతోంది. పాక్ జట్టు తమ ప్రారంభ మ్యాచ్‌లలో అమెరికా, నెదర్లాండ్స్‌ను ఓడించింది. మరోవైపు భారత జట్టు అమెరికా, నమీబియాను ఓడించింది.

వర్షం జరిగితే రెండు జట్లకు చెరో పాయింట్
కాగా, తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం ఫిబ్రవరి 15న రోజు మొత్తం వర్షం కురిసే ఛాన్స్ ఉందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, వర్షం పడే అవకాశం 60% నుంచి 50% వరకు ఉంటుంది. మ్యాచ్ సమయంలో, సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, 10% నుండి 20% వరకు వర్షం పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నాయి. ఈ రోజు కూడా కొలొంబోలో వర్షం కురుస్తోందని తాజా సమాచారం. సాయంత్రం 6 గంటల వరకు 25% ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. అర్ధ రాత్రి వరకు వర్షం పడే అవకాశం 10% మాత్రమే ఉంది. ప్రస్తుతం, గాలులు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వీస్తున్నాయి. దీని వలన కొలంబోలో వర్షం పడే అవకాశం పెరుగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిస్తే, రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. అయితే, ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications