రోహిత్ శర్మ అలా- బాబర్ ఆజమ్ ఇలా..!!

అహ్మదాబాద్: ఇంకొన్ని గంటలు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఐసీసీ వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.

వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఓ అరుదైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. అన్ని మ్యాచ్‌లల్లోనూ విజయఢంకా మోగించింది. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏడుసార్లు ఈ రెండు జట్లు తలపడగా.. అన్నిసార్లూ భారత్‌దే పైచేయి అయింది.

IND vs PAK: Its captains fight-Rohit sharma in top class form where as Babar Azamnottothemark

ఇప్పుడా రికార్డును కాపాడుకుంటుందా?, టీమిండియాపై ఈ వరస్ట్ రికార్డ్‌ను పాకిస్తాన్ కొనసాగిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. 7-1గా మారుతుందా? లేక 8-0గా భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు తమ ప్రత్యర్థులను ఓడించిన తీరు చూస్తోంటే మరోసారి భారత్ గెలుపు ఖాయమే.

ఈ రెండు జట్ల సారథులు.. విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోన్నారు. కేప్టెన రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కుతోండగా.. దీనికి భిన్నంగా పట్టుమని 10 పరుగులు చేయలేకపోతున్నాడు అతని కౌంటర్‌పార్ట్ బాబర్ ఆజమ్. రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్‌ను డకౌట్‌తో ఆరంభించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఖాతా ఓపెన్ చేయలేదు రోహిత్.

రెండో మ్యాచ్‌లో మాత్రం దుమ్ము దులిపాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై చెలరేగాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 84 బంతుల్లోనే 16 బౌండరీలో, అయిదు భారీ సిక్సర్లతో 131 పరుగులను సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ముందు ఆ జట్టుకు ప్రమాదకర సంకేతాలు పంపించాడు. అదే దూకుడును ఆశిస్తోన్నారు టీమిండియా ఫ్యాన్స్.

రోహిత్ శర్మ ఈ రేంజ్‌లో చెలరేగుతోండగా.. బాబర్ ఆజమ్ మాత్రం చతికిలపడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విఫలం అయ్యాడు. అయిదు పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత కూడా అతను తన ఫామ్‌ను అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బాబర్ చేసింది 10 పరుగులే. లంకేయులు భారీ స్కోర్‌ను నిర్దేశించినప్పటికీ- పాకిస్తాన్ విజయం సాధించింది.

ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 113, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్- 131 పరుగులతో లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. జట్టు విజయం సాధించినప్పటికీ- అందులో బ్యాటర్‌గా బాబర్ ఆజమ్ కాంట్రిబ్యూషన్ అనేది జీరో. 10 పరుగులకే అవుట్ కావడం అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+